Asianet News TeluguAsianet News Telugu

భారత్ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు

విదేశాల్లో వరుస విజయాలతో మంచి జోరుమీదున్న భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. స్వదేశంలో జరిగిన వన్డే సీరిస్‌ పరాభవానికి బదులు తీర్చుకోవాలని  భావిస్తున్న కివీస్ ఆటగాళ్లు అనుకున్నంత పని చేశారు. వెల్లింగ్టన్ లో జరిగిన మొదటి టీ20లో అన్ని విభాగాల్లో టీంఇండియాపై పైచేయి సాధించి కివీస్ ఘన విజయం సాధించింది. ఇలా కివీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్ టీ20 క్రికెట్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నెలకొల్పింది. 

team india very bad record in wellington t20
Author
Wellington, First Published Feb 6, 2019, 6:17 PM IST

విదేశాల్లో వరుస విజయాలతో మంచి జోరుమీదున్న భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. స్వదేశంలో జరిగిన వన్డే సీరిస్‌ పరాభవానికి బదులు తీర్చుకోవాలని  భావిస్తున్న కివీస్ ఆటగాళ్లు అనుకున్నంత పని చేశారు. వెల్లింగ్టన్ లో జరిగిన మొదటి టీ20లో అన్ని విభాగాల్లో టీంఇండియాపై పైచేయి సాధించి కివీస్ ఘన విజయం సాధించింది. ఇలా కివీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్ టీ20 క్రికెట్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నెలకొల్పింది. 

వెల్లింగ్టన్ టీ20లో కివీస్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీంఇండియా చతికిల పడింది. కేవలం 139 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యింది. దీంతో 80 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమిపాలయ్యింది. అయితే  టీంఇండియా ఇప్పటివరకు ఆడిన అంతర్జాతీయ టీ-20ల్లో ఇంత ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోవడం ఇదివరకు జరగలేదు. దీంతో టీంఇండియా ఖాతాలో అత్యంత చెత్త రికార్డు చేరింది. 

2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో ఓడిపోవడమే అత్యంత చెత్త రికార్డుగా నిలిచింది. తాజాగా వెల్లింగ్టన్ టీ20లో 80 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత జట్టు అంతకంటే చెత్త రికార్డును సాధించింది. 

సంబంధిత వార్తలు

అందువల్లే ఇంత ఘోరంగా ఓడిపోయాం: రోహిత్

వెల్లింగ్టన్ టీ20: చుక్కలు చూపించిన కివీస్ బౌలర్లు, భారత్ ఓటమి

Follow Us:
Download App:
  • android
  • ios