న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతీ మంధాన చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. కేవలం 24 బంతుల్లోనే అర్థసెంచరీ చేసి భారత్ తరపున టీ20లలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు.

ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికి మంధానపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. చాహల్ టీవీ పేరుతో అతను గత కొన్ని రోజులుగా క్రికెటర్లను ఇంటర్వ్యూ చేస్తూ నవ్వులు పూయిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక పోతే, మంధాన  ఇంటర్య్యూ విషయానికి వస్తే.. తన బ్యాటింగ్‌ను చూసి ఏమైనా నేర్చుకున్నారా అని చాహల్ అడగ్గా.. ‘‘అవును నా భీకర బ్యాటింగ్‌కు నువ్వు స్ఫూర్తని సరదాగా చెప్పారు స్మృతీ. ‘‘అవును హామీల్టన్‌లో నా బ్యాటింగ్ తీరుకు నువ్వే స్ఫూర్తి.

న్యూజిలాండ్ జట్టుపై నువ్వు చేసిన బ్యాటింగ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను అప్పుడే నా గేమ్‌ను ఇంకా మెరుగుపరచుకోవాలనుకున్నా.. నేను స్పూర్తి పొందే క్రికెటర్లలో నువ్వు ఒకడివి. నేను బ్యాటింగ్‌కు వెళ్లే క్రమంలో నీ ఆట తీరును గుర్తు చేసుకుంటున్నా అంటూ మంధాన నవ్వులు పూయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.