టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో...అంతే ప్రాధాన్యత కుటుంబానికి కూడా ఇస్తాడు. అతడు ఎక్కడికెళ్ళినా తన భార్య అనుష్క శర్మను వెంటతీసుకెళ్లడాన్ని బట్టి చూస్తేనే ఆమెను ఎంతగా ప్రేమిస్తాడో అర్థమవుతుంది. ఇలా తాజాగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా భార్య అనుష్కతో కలిసి వెళ్లిన కోహ్లీకి మూడో వన్డే తర్వాత విశ్రాంతి లభించింది. ఇలా లభించిన విశ్రాంతి సమయాన్ని న్యూజిలాండ్ లోనే గడుపుతున్న కోహ్లీ... భార్య అనుష్కతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. 

తాజాగా తన భార్యతో న్యూజిలాండ్ అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ కోహ్లీ ఓ పోటోను ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. భార్యాభర్తలిద్దరు పచ్చటి  చెట్ల మధ్య  నడుచుకుంటూ వెళుతున్న ఈ ఫోటోను ''నా భార్య'' అనే క్యాప్షన్ జతచేసి కోహ్లీ పోస్ట్ చేశాడు. ఇలా ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న కోహ్లీ జంట ఫోటోపై క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ లో మొదటి మూడు వన్డేలను టీంఇండియా వరుసగా గెలిచింది. దీంతో మరో రెండు వన్డేలు మిగిలుండగానే వన్డే సీరిస్ భారత్ వశమైంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా  విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిసిసిఐ విశ్రాంతినిచ్చింది. ఇలా అనుకోకుండా లభించింన హాలిడే సమయాన్ని కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆనందంగా గడుపుతున్నాడు.  
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

👫 mine 🥰 @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) on Feb 4, 2019 at 10:54pm PST