Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ వేదికపై అదరగొట్టిన సిక్కి రెడ్డి- దృవ్ జోడి... ఇండోనేషియా మాస్టర్స్ లో సంచలన విజయం

ఇండోనేషియా మాస్టర్స్ సూపర్‌-750 టోర్నమెంట్ లో భారత బ్యాడ్మింటన్ జోడి సిక్కిరెడ్డి-దృవ్ కపిల జోడి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 

Dhruv Kapila-Sikki Reddy duo sensational victory in Indonesia Masters
Author
Indonesia, First Published Nov 18, 2021, 8:49 AM IST

ఇండోనేషియా: అంతర్జాతీయ వేధికపై బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సిక్కి రెడ్డి- దృవ్ కపిల జోడీ సత్తా చాటింది. ఇండోనేషియా మాస్టర్స్ సూపర్‌-750 టోర్నమెంట్ లో ఈ జోడీ సంచలన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన  మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. 178వ ర్యాంకులో కొనసాగుతున్న సిక్కి-దృవ్ జంట ఏకంగా ప్రపంచ 5వ ర్యాంక్, రెండో సీడ్‌ ప్రవీణ్‌ జోర్డాన్‌–మెలాతి దెవా ఒక్తావియాంతి (ఇండోనేసియా) జంటను మట్టికరిపించి చరిత్ర సృష్టించింది. 

indonesia masters super‌-700 లో భాగంగా బుధవారం జరిగిన mixed doubles లో sikki reddy - dhuruv kapila జోడీ ఇండోనేషియాకు చెందిన ప్రవీణ్‌–మెలాతి జోడీతో హోరాహోరీగా పోరాడారు. అయితే మొదటి సెట్ లో 21-11 సునాయాసంగానే గెలిచుకున్నా రెండో రౌండ్ లో గట్టి పోటీ ఎదురయ్యింది. అయినప్పటికి 22-20 తేడాతో ఆధిక్యం సాధించింది. ఇలా వరుసగా రెండు సెట్లను గెలుచుకున్న సిక్కి రెడ్డి-జోడి ప్రపంచ నెంబర్ 5 జోడీని వారి స్వదేశంలోనే ఓడించింది.  

కేవలం 30 నిమిషాల్లోనే సిక్కిరెడ్డి- దృవ్, ప్రవీణ్‌–మెలాతి జోడీల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసింది. రెండో సెట్ లో మొదట వెనకబడినా ఆ తర్వాత పుంజుకుని వరుసగా పాయింట్లు రాబట్టిన సిక్కి రెడ్డి–ధ్రువ్‌ ద్వయం 22–20తో గేమ్ ముగించింది. 

 సిక్కి రెడ్డి-దృవ్ జంట మినహా భారత బ్యాడ్మింటన్ జోడీలేవి మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో విజయం సాధించలేకపోయాయి. తొలి మ్యాచ్ లోనే  సుమిత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ ఇండోనేషియాకు చెందిన ఫైజల్‌–గ్లోరియా చేతిలో  15–21, 16–21తో ఓటమిపాలయ్యారు. ఇక మరో జోడి వెంకట్‌ గౌరవ్‌ ప్రసాద్‌–జూహీ దేవాంగన్‌  15–21, 12–21 తేడాతో హాంకాంగ్ జోడి చాంగ్‌ తక్‌ చింగ్‌–ఎన్జీ వింగ్‌ యుంగ్‌ చేతిలో ఓటమిని చవిచూసారు. 

ఇక  పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ విజయాలు సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. ఇక పారుపల్లి కశ్యప్‌,  సాయిప్రణీత్‌ మొదటి రౌండ్ లోనే ఓటమిపాలై ఇంటిదారి పట్టారు. ఇలా ఇండోనేషియా మాస్టర్స్ సూపర్‌-750 టోర్నమెంట్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios