బంగ్లాదేశ్ ఆటగాళ్లకు అల్ప సంతోషానికే అధికంగా సంబరాలు చేసుకోవడం అలవాటైంది. గతంలో నిదహాస్ ట్రోపిలో శ్రీలంకను ఓడించిన ఆనందంలో టీం మొత్తం గ్రౌండ్ లోనే నాగిని డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇలా ప్రత్యర్థి జట్టును అవమానించేలా సంబరాలు జరుపుకోవడం వివాదాస్పదమైంది. అయితే ఆ సంఘటన తర్వాత కూడా బంగ్లా ఆటగాళ్లు మారినట్లులేరు. ఆసియాకప్ ఫైనల్లో కూడా మరోసారి నాగిని డ్యాన్స్ చేసి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.

శుక్రవారం భారత్, బంగ్లా మధ్య జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో భారత ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ ను ఔట్ చేసిన ఆనందంలో నజ్ముల్ ఇస్లామ్ మరోసారి నాగిని డ్యాన్స్ చేశాడు. సౌమ్య సర్కార్ క్యాచ్‌ను అందుకోగానే బౌలర్‌ నజ్ముల్‌ నాగిని డ్యాన్స్ చేశాడు. అనంతరం సౌమ్య సర్కార్ కూడా నజ్ముల్ ని అనుసరించాడు. వీరిని చూసి బంగ్లా అభిమానులు కూడా పోడియంలో నాగిని డ్యాన్స్ చేశారు. బంగ్లా ఆటగాళ్ల నాగిని డ్యాన్స్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 శుక్రవారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో చివరకు భారత జట్టే విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంటతో సాగిన మ్యాచ్ లో బంగ్లా పై టీంఇండియాదే పైచేయిగా నిలిచింది. 

 

ఆసియా కప్ సంబంధిత వార్తలు

పాక్ ను చిత్తు చేసిన బంగ్లా: ఫైనల్లో భారత్ తో పోరు

మ్యాచ్ టై: భారత్ ను వణికించిన అఫ్గానిస్తాన్

రాహుల్.. ఇదంతా నీవల్లే.. నెటిజన్ల మండిపాటు

తగ్గని వెన్నునొప్పి.. ఆసియాకప్ నుంచి వైదొలిగిన హార్డిక్ పాండ్యా

పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు