కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హజరితో బలహీనంగా ఉన్న భారత జట్టుకు మరో షాక్ తగిలింది. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న అల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా కూడా ఆసియా కప్‌ నుంచి వైదొలిగాడు.

బుధవారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో 18వ ఓవర్‌ ఐదో బంతిని వేసిన అనంతరం పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. జట్టు ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో.. అతన్ని స్ట్రెచర్‌పై ఉంచి తరలించారు.

నొప్పి తీవ్రంగా ఉండటం.. తగినంత విశ్రాంతి కావాలని వైద్యులు సూచించడంతో ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో పాండ్యా ఆడట్లేదని బీసీసీఐ వర్గాలు ప్రకటించాయి. అతని స్థానంలో దీపక్ చాహర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాహర్ ఇవాళ దుబాయ్‌ చేరుకోవచ్చని బీసీసీఐ తెలిపింది.

పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు