భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్లో ఫోబియాను అధిగమించలేకపోయింది. ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో బ్మాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో చైనా క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో ఓటమి పాలైంది.

డ్రాప్ షాట్లు, స్మాష్లు ఆడిన తైజు... సింధును ఒత్తిడికి గురిచేసింది. రెండో గేమ్‌ను బాగానే ఆరంభించిన సింధు చివరి వరకు దానిని కొనసాగించలేకపోయింది. దీంతో మరోసారి రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు వీరిద్దరూ 13 సార్లు తలపడగా 10 సార్లు తైజుయింగ్‌దే పైచేయి కావడం విశేషం.

ఆసియా క్రీడల చరిత్రలో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.. అంతేకాకుండా 1982 తర్వాత సింగిల్స్‌లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

ఆసియా క్రీడల్లో సింధు సంచలన విజయం... స్వర్ణానికి మరో అడుగు దూరంలో

చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు సైనా, సింధు