Asianet News TeluguAsianet News Telugu

ఆసియా క్రీడల్లో సింధు సంచలన విజయం... స్వర్ణానికి మరో అడుగు దూరంలో

ఆసియా క్రీడల మహిళా బ్యాడ్మింటన్ టోర్నీలో ఇవాళ భారత్ కు మిశ్రమ పలితాలె లభించాయి. సౌనా నేహ్వల్ చైనా క్రీడాకారిణి చేతితో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకోవడం కాస్త నిరాశ పర్చినా సింధు స్వర్ణ పోరుకు అర్హత సాధించి భారత శిబిరంలో ఆనందం నింపింది.

P V Sindhu enters Asian Games final
Author
Jakarta, First Published Aug 27, 2018, 1:19 PM IST

ఆసియా క్రీడల్లో ఇవాళ భారత్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. మహిళల సింగిల్స్ లో ఇప్పటికే సైనా నేహ్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకోగా మరో హైదరబాదీ షట్లర్ పివి సింధు ఫైల్ పోరుకు సిద్దమైంది. సెమి ఫైనల్లో ఘన విజయం సాధించిన సింధు స్వర్ణ పోరుకు సిద్దమైంది.

ఇవాళ జపాన్ షట్లర్ యామగూచితో హోరాహోరాగా పోరాడిన సింధు చివరకు అపూర్వ విజయాన్ని సాధించింది. మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది.  దీంతో ఇప్పటికే రజతం ఖాయమైనప్పటికి స్వర్ణ పతకమే లక్ష్యంగా సింధు ఫైనల్లో అడుగుపెట్టింది. 

ఈ గెలుపుతో ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో ఫైనల్ కు చేరిన భారత క్రీడాకారిణిగా సింధు నిలించింది. సింధు ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ చైనా క్రీడాకారిణి తైజు ఇంగ్ ( సైనా ను ఓడించిన షట్లర్) తో తలపడనుంది. మంగళవారం వీరివద్ద ఫైనల్ పోటీ జరగనుంది. ఇందులో సింధు విజయం సాధిస్తే ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్రలో నిలవనుంది.

సెమిఫైనల్లో సింధు, యమగూచి మధ్య ఆట హోరాహోరి సాగింది. మొదటి రౌండ్ లో సింధు గెలుపొందక, రెండో రౌండ్లో యమగూచి విజయం సాధించింది. దీంతో మూడో రౌండ్ నిర్ణయాత్మకంగా మారింది. ఇందులో సింధు సమయోచితంగా ఆడుతూ జపాన్ షట్లర్ పై ఫైచేయి సాధించింది. మూడో రౌండ్ లో 14-21 తొ గెలుపొందిన సింధు ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios