అబ్బ సాయిరామ్.! SRH ప్లేయర్‌పై బీసీసీఐ బ్యాన్.. పండుగ చేసుకుంటున్న ఆరెంజ్ ఆర్మీ
SRH: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ దూరమయ్యాడు. 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు అర్ధాంతరంగా తప్పుకోవడంతో బీసీసీఐ అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది.

అబుదాబీలో మినీ వేలం
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. అయితే ఈ మినీ ఆక్షన్‌కు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, SRH మాజీ బ్యాటర్ హ్యారీ బ్రూక్ దూరం కానున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు అతను ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడమే ఇందుకు కారణం. బీసీసీఐ నిబంధనల ప్రకారం, వేలంలో రిజిస్టర్ చేసుకుని ఎంపికైన తర్వాత, సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా పోయిన ఏ ఆటగాడినైనా రెండు సీజన్ల పాటు టోర్నమెంట్‌లో, వేలంలో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. అందుకే బ్రూక్‌పై బీసీసీఐ బ్యాన్ విధించింది.
ఆ నిబంధనతో నిషేధం
ఈ నిబంధనను విధించిన తర్వాత ఐపీఎల్ చరిత్రలో నిషేధాన్ని ఎదుర్కొన్న తొలి ఆటగాడు హ్యారీ బ్రూక్ కావడం గమనార్హం. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసిన తర్వాత, ఆ ఆటగాడు గాయపడితే తప్ప ఇతర ఏ కారణంతో విదేశీ ఆటగాళ్లు వైదొలిగినా రెండేళ్ల నిషేధం తప్పదని ఐపీఎల్ నిబంధనల్లో ఉంది.
బ్రూక్ కీలక ప్రకటన..
వేలంలో తన పేరు లేకపోవడంతో ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేందుకు, ఇంగ్లాండ్ క్రికెట్ పై దృష్టి సారించడానికి ఈ ఏడాది దూరంగా ఉన్నానని బ్రూక్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ తర్వాత జూన్ నెలలో ఇండియాతో ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరగాల్సి ఉంది.
ఆ సిరీస్ లు ముఖ్యం..
అలాగే, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ పైనే బ్రూక్ తన పూర్తిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కీలకమైన సిరీస్‌లకు సిద్ధం కావడానికి అతను ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. గతంలో, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హ్యారీ బ్రూక్‌ను రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2027 రీ-ఎంట్రీ.?
అయితే, అతను ఐపీఎల్ నుంచి తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ నిషేధం కారణంగా, బ్రూక్ 2025, 2026 ఐపీఎల్ సీజన్‌లకు పూర్తిగా దూరం కానున్నాడు. ఐపీఎల్ 2027లో తిరిగి వస్తాడో లేదో.. చూడాల్సిందే.

