చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు సైనా, సింధు

ఆసియా క్రీడల్లో భారత్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు చరిత్ర సృష్టించారు. భారత్‌ కు మరో రెండు పతకాలను ఖాయం చేశారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు గెలిచి సెమీస్‌కు అర్హత సాధించారు

PV Sindhu, Saina Nehwal Secure 2 Medals For India...Enter Semis

జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు చరిత్ర సృష్టించారు. భారత్‌ కు మరో రెండు పతకాలను ఖాయం చేశారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు గెలిచి సెమీస్‌కు అర్హత సాధించారు. 

మెుదట క్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ 21-18, 21-16 తేడాతో రచనోక్‌పై గెలిచి సెమీస్‌కు చేరగా...ఆ తర్వాత జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో పీవీ సింధు 21-11, 16-21, 21-14 తో జిందాపోల్‌(థాయ్‌లాండ్‌)పై గెలిచి సెమీస్‌లోకి ప‍్రవేశించారు. 

దీంతో ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌ విభాగంలో తొలిసారి పతకాలు సాధించి సరి కొత్త చరిత్ర సృష్టించారు సైనా, సింధులు. 
ఇప‍్పటివరకూ ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు పతకాలు దక్కలేదు. అయితే ఆ స్వప్నాన్ని సైనా, సింధులు నెరవేర్చనున్నారు. భారతదేశ చరిత్రలో ఏషియన్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో పతకాలు సాధించిన విజేతలుగా రికార్డు నెలకొల్పనున్నారు. 

మరోవైపు మహిళల ఆర్చరీ విభాగంలోనూ భారత్ కు పతకం ఖాయమైంది. కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో భారత్‌ 225-222 తేడాతో చైనీస్‌ తైపీపై గెలిచి ఫైనల్లోకి ప‍్రవేశించింది. దాంతో భారత్‌కు పతకం ఖాయమైంది. పసిడి పోరులో దక్షిణకొరియాతో భారత్‌ జట్టు అమీతుమీ కి రెడీ అవుతోంది. 

ఇకపోతే ఈక్వెస్ట్రైన్ విభాగంలో భారత్‌ రెండు రజతాలను సాధించింది. వ్యక్తిగత విభాగంలో ఫౌద్‌ మిర్జా రజతాన్ని సాధించాడు. ఫౌద్‌ మిర్జా మొత్తం 26. 40 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించగా, టీమ్‌ ఈక్వెస్ట్రైన్ ఈవెంట్‌లో రాకేశ్‌ కుమార్‌, ఆశిష్‌ మాలిక్‌, జితేందర్‌ సింగ్‌లు రజతాన్ని సాధించారు. ఈ త్రయం 121.30 స్కోరుతో రజతాన్ని ఒడిసి పట్టుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios