టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని.. ఆయన భార్య అనుష్క శర్మ గన్ తో కాల్చేసింది. కాకపోతే అది నిజం గన్ కాదులేండి. ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటవల బెంగెళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ... చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని కోహ్లీ దంపతులు సెలబ్రేట్ చేసుకున్నారు.

ఓ గేమింగ్ సెంటర్ కి వెళ్లిన విరాట్, అనుష్క వెళ్లారు. కాగా.. అక్కడి లేజర్ ట్యాగ్ గన్నుతో అనుష్క.. విరాట్ ను షూట్ చేస్తున్నట్లు యాక్ట్ చేయగా.. బులెట్ తగిలి కిందపడిపోయినట్లు విరాట్ నటించడం విశేషం. దీనంతటినీ అక్కడే ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టీన్ రికార్డ్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఈ వీడియో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. వీడియోపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఆర్సీబీ కేవలం మూడు మాత్రమే గెలిచింది.