తొలి వన్డేలో ఆసక్తికరమైన పరిణామం.. దసున్ శనక రనౌట్ అయినా ఆప్పీల్ ను ఉపసంహరించుకున్న రోహిత్ శర్మ.. ఎందుకంటే ?
రోహిత్ శర్మ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నారు. తొలి వన్డేలో చివరి ఓవర్ సమయంలో శ్రీలంక విజయానికి ఆమడదూరంలో నిలిచింది. ఈ సమయంలో 98 పరుగుల వద్ద ఉన్న లంక కెప్టెన్ దసున్ శనక రన్ ఔట్ అయ్యారు. కానీ థర్మ్ ఎంపైర్ అప్పీల్ ను టీం ఇండియా కెప్టెన్ వెనక్కి తీసుకొని మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చారు.

గౌహతిలో శ్రీలంక, భారత్ కు మధ్య జరిగిన మొదటి వన్డేలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. శ్రీలంక టీం కెప్టెన్ దసున్ శనక మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే రన్ ఔట్ అయ్యారు. అయినా కూడా ఆయన ఔట్ కాకుండా రోహిత్ శర్మ థర్డ్ ఎంపైర్ ఆప్పీల్ ను వెనక్కి తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
శనక ఒంటరిపోరాటం.. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన.. తొలి వన్డేలో రోహిత్ సేన ఘన విజయం
మ్యాచ్ చివరి ఓవర్ ఇది చోటు చేసుకుంది. శ్రీలంక భారత్ పై విజయం సాధించాలంటే 374 పరుగులు తీయాల్సి ఉంది. చివరి ఓవర్ వచ్చినప్పటికీ నిర్ణితీ లక్ష్యానికి చాలా దూరంలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో చివరి ఓవర్ లో బౌలింగ్ చేసేందుకు షమీ పరిగెత్తారు. కానీ బంతి వేయడానికి ముందే శనక క్రీజును వదిలి పరిగెత్తడం మొదలుపెట్టారు. దీనిని గమనించిన బౌలర్ బంతిని బెల్స్ కు తాకించాడు.
ఇది ఔట్ ఆ ? కాదా ? అని తెలుసుకునేందుకు అక్కడ ఉన్న ఎంఫైర్ థర్డ్ ఎంఫైర్ ను సంప్రదించాడు. ఆ సమయంలో శ్రీలంక మూడు బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉండగా, షనక 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో రోహిత్ శర్మ ముందుకొచ్చి షమీతో మాట్లాడారు. థర్మ్ ఎంపైర్ అప్పీల్ ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో శనక మళ్లీ బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 108 పరుగులు తీశాడు. దీంతో అతడు సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా నిలిచారు.
ఒక వేళ రోహిత్ షమీ అప్పీల్‌ను ఉపసంహరించుకోకుంటే శనక ఔట్ అయ్యే వాడు. అతడి రికార్డుల్లో ఒక సెంచరీ దక్కకుండా పోయేది. తోటి ఆటగాడి గురించి ఆలోచించి రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక కెప్టెన్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించడానికి టీమ్ ఇండియా కెప్టెన్ అనుమతించారు. మొత్తానికి ఆయన 88 బంతుల్లో 108 పరుగులు తీసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడారు. ‘‘ షమీ అప్పీల్ వెళ్లాడని నాకు తెలియదు. కానీ ఆ సమయంలో ఆయన (శనక) 98 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అతడు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. మేము అతడిని అలా అవుట్ చేయాలని అనుకోలేదు. అందుకే మేము అతడిని బ్యాటింగ్ చేయనిచ్చాం. అతడికి హ్యాట్సాఫ్. అతను నిజంగా బాగా ఆడాడు.’’ అని ఆయన అన్నారు.
భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న లంక.. వికెట్ల కోసం కసిగా భారత బౌలర్లు
కాగా.. టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. జనవరి 12న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే రెండో వన్డే కోసం టీంలు ఇప్పుడు కోల్‌కతాకు వెళ్తున్నాయి.