ఇది నా పుట్టినరోజుకి స్పెషల్ గిఫ్ట్.. పీవీ సింధు విజయంపై తల్లి విజయ
ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజుకి సింధు ఏదో ఒక బహుమతి ఇస్తుందని... కానీ ఈ గిఫ్ట్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పారు. ఈసారి తనతోపాటు దేశానికి కూడా సింధు బహుమతి అందజేశారని ఆమె చెప్పారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ని తెలుగు తేజం పీవీ సింధు కైవసం చేసుకుంది. ఆమె విజయం పట్ల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింధు విజయం సాధించిందన్న విషయం తెలియగానే వారు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సింధు తల్లి విజయ మీడియాతో మాట్లాడారు.
తన పుట్టిన రోజుకి సింధు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. విజయం సాధించిన వెంటనే పీవీ సింధు కూడా.. తన విజయాన్ని తల్లికి అంకితం చేస్తున్నానని... ఈ రోజు తన తల్లి పుట్టిన రోజు అంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో విజయ మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజుకి సింధు ఏదో ఒక బహుమతి ఇస్తుందని... కానీ ఈ గిఫ్ట్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పారు. ఈసారి తనతోపాటు దేశానికి కూడా సింధు బహుమతి అందజేశారని ఆమె చెప్పారు.
సింధు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో చైనీస్ తైపీ క్రీడాకారిణిపై గెలవడమే టర్నింగ్ పాయింట్ అని ఆమె చెప్పారు. గతంలో రెండుసార్లు ఫైనల్స్ దాకా చేరుకొని స్వర్ణాన్ని సింధు చేజార్చుకుంది. ఆ సమయంలో సింధుకి ఫైనల్ ఫోబియా అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ విజయంతో సింధు వాటన్నింటికీ సమాధానం చెప్పిందని ఆమె తల్లి విజయ స్పష్టం చేశారు.
ఈ ఛాంపియన్ షిప్ కోసం సింధు గత ఆరునెలలుగా తీవ్రస్థాయిలో సాధన చేసిందని చెప్పారు. సింధుతోపాటు తామంతా కూడా ఈ టైటిల్ కోసం ఎదురు చూశామని ఆమె తెలిపారు. అనంతరం కుటుంబసభ్యులందరూ మిఠాయిలు పంచుకొని.. ఒకరి నోటిని మరొకరు తీపి చేసుకున్నారు.
సంబంధిత వార్తలు
చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం
2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు
తెలుగు తేజం పివి సింధును అభినందించిన ప్రధాని, రాష్ట్రపతి
సింధుకి బంగారు పతకం... ఎమ్మెస్కే అభినందనలు