2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సరం పంచాంగం

శ్రీ ప్లవ నామ సంవత్సరం  13-ఏప్రిల్-2021 న ప్రారంభమై  01-ఏప్రిల్-2022 న ముగుస్తుంది.

Sri Plava Nama Samvatsara Ugadi Panchangam 2021

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Sri Plava Nama Samvatsara Ugadi Panchangam 2021

శ్రీ ప్లవ నామ సంవత్సరం  13-ఏప్రిల్-2021 న ప్రారంభమై  01-ఏప్రిల్-2022 న ముగుస్తుంది.

శ్రీ ప్లవ నామ సంవత్సర నాయక - ఉపనాయక గ్రహములు: 
రాజు - కుజుడు, 
మంత్రి - కుజుడు, 
సేనాధిపతి - చంద్రుడు, 
సస్యాధిపతి - శుక్రుడు, 
ధాన్యాధిపతి - బుధుడు, 
ఆర్ఘాధిపతి - కుజుడు, 
మేఘాధిపతి - కుజుడు, 
రసాధిపతి - రవి, 
నీరసాధిపతి - శుక్రుడు, 
పశు పాలకుడు - యముడు, 
పురోహితుడు - శుక్రుడు, 
పరీక్షకుడు - గురుడు, 
గ్రామ పాలకుడు - కుజుడు, 
అశ్వాధిపతి - కుజుడు, 
దేవాధిపతి - శుక్రుడు, 
వస్త్రాధిపతి - రవి, 
రత్నాధిపతి -  కుజుడు, 
మృగాధిపతి - చంద్రుడు.

శ్రీ ప్లవ నామ సంవత్సరం ఫలితం: 60 తెలుగు కాలమాన సంవత్సరాలలో శ్రీ ప్లవ నామ సంవత్సరం 35 వ సంవత్సరం. శ్రీ ప్లవ నామ సంవత్సరమునకు రాజు కుజుడు, సంవత్సర అధిపతి బుధుడు. ఈ సంవత్సరం మధ్యమ వర్షములు కురియును. ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొనుట అధికం అగును. సస్యాబివ్రుద్ధి బాగుండును. జ్యేష్ట మరియు ఆషాడ మాసములలో ఆంధ్ర రాష్ట్ర ముందు ఆందోళన పూరిత వాతావరణం. 

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శుక్ర మూడమి సమయం:- 13 ఏప్రిల్ 2021 నుండి 07 మే 2021 వరకు తిరిగి 02 జనవరి 2022 నుండి 16 జనవరి 2022 వరకు.
 
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో గురు మూడమి సమయం:- 18 ఫిబ్రవరి 2022 నుండి 20 మార్చ్ 2022 వరకు.
  
* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో వాస్తు కర్తరి సమయములు:- 05 మే 2021 నుండి 11 మే 2021 వరకు డొల్లు కర్తరి, 12 మే 2021 నుండి 28 మే 2021 వరకు నిజ కర్తరి ఏర్పడును.

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో మకర సంక్రాంతి సమయం:-  14 జనవరి 2022 మధ్యాన్నం 2:21 నిముషాలకు సూర్య గ్రహం మకర సంక్రమణ చేయును. ఈ సమయం నుండి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం అగును. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు “ మిశ్ర నామకుడు “. మిశ్ర నామకుని వలన ప్రజా ఆరోగ్య సంక్షోభాలు ఏర్పడును. 

* సింధు నది పుష్కరాలు:-  శ్రీ ప్లవ నామ సంవత్సరంలో 20 నవంబర్ 2021 న రాత్రి 10:55 నిముషాలకు గురువు కుంభరాశి ప్రవేశంతో పవిత్ర సింధూ నది పుష్కరాలు ప్రారంభం అగును. 

* శ్రీ ప్లవ నామ సంవత్సరంలో గ్రహణాలు లేవు. మన భారత దేశానికి వరించే గ్రహాణాలు ఈ సంవత్సరంలో ఏమీలేవు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios