Asianet News TeluguAsianet News Telugu

మౌని అమావాస్య

మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. 

kumbh mela 2021 Haridwar mauni Amavasya
Author
Hyderabad, First Published Feb 11, 2021, 10:07 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

kumbh mela 2021 Haridwar mauni Amavasya

మౌని అమావాస్య అనగానేమి ? ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటి ? పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్రస్నానాలు ఆచరిస్తారు.  స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసేచోట చేస్తే పెరుగుతుంది. మరో ముఖ్య విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది.

మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత:- మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని అమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు. మౌనికి అనువాదం - మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అమ - చీకటి మరియు వస్య - కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని. చంద్ర దేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. 

మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు 'మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు, అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.' శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధిచేసుకునే పవిత్రనదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు.

మౌని అమావాస్య ప్రాముఖ్యత:- మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.

గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంత మంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు. వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరభారతం వారు పాటించే క్యాలెండర్ లో మాఘమాసంలో వస్తుంది

మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలి :- సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడతారు. గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు. మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే మీరు అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను పాటించవచ్చు. మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే మీ ఇంట్లో గంగానది నీళ్ళు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్ళకి జతచేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవవచ్చు.

                'గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ,
                నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు'

పై మంత్రం భారత ఉపఖంఢంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది.

పితృపూజ:- పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని, వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు.

ధ్యానం:- ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉఛ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తుంది.

దానాలు:- ఈ రోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైనవారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం , బట్టలు ఇవ్వవచ్చును. గోచార గ్రహ స్థితి రిత్య శని ప్రభావంతో ఉన్నారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios