ఈ రోజు వైష్ణవ శ్రీకృష్ణ జయంతి
అష్టమిలో పుట్టిన ఈ చిన్ని కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయుధం పట్టకుండానే వెనకుండి కురక్షేత్రాన్ని నడిపించిన మహా యోధుడు.
నారాయణప॑రో జ్యోతిరాత్మా నా॑రాయణః ప॑రః
నారాయణపరం॑ బ్రహ్మతత్త్వం నా॑రాయణః ప॑రః
శ్రీ కృష్ణుని జననం 19 జులై తేదీకి శ్రీ ముఖ నామ సంవత్సరం, శ్రావణ మాసంలోని బహుళ పక్షం అష్టమి తిధి, రోహిణి నక్షత్రం, నాల్గవ పాదం, వృషభలగ్నమందు అర్ధరాత్రి సమయాన దేవకి-వసుదేవుడు దంపతులకు క్రీ.పూ3228 సంవత్సరంలో జన్మించాడు.
ఈ రోజు వేకువ జామున నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తలంటి స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. భగవద్గీత.. హిందువుల పవిత్ర గ్రంథమే కాదు సకల ధర్మాలు అందులో ఉంటాయి. ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇందులో సమాధానముంటుంది. ఇంతటి మహోత్తరమైన గ్రంథాన్ని మనకు అందించిన శ్రీ కృష్ణుడు జన్మదినం ఈ రోజు.
అష్టమిలో పుట్టిన ఈ చిన్ని కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయుధం పట్టకుండానే వెనకుండి కురక్షేత్రాన్ని నడిపించిన మహా యోధుడు. అంతటి మహత్తరమైన వ్యక్తి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ నేపథ్యంలో కృష్ణ జన్మాష్టమి తిథి, ముహూర్తం, సమయం లాంటి విషయాలతో పాటు ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి, కృష్ణాష్టమి ప్రత్యేకత ఏంటి లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నేడు శ్రీ కృష్ణుడికి అత్యంత ఇష్టమైన పర్వదినం. ఈ రోజు చిన్ని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి.
శ్రీ కృష్ణాష్టమి రోజు పూజా విధానం :- వేకువ జామున నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తలంటి స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని ఆవుపేడతో ఇంటి ముందు కల్లాపి జల్లి రంగు వల్లు తీర్చిదిద్దాలి. గడపకు పసుపు కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి. చిన్ని కృష్ణుడు వస్తున్నట్లుగా పాదాలు చిత్రించుకోవాలి. బాలకృష్ణుడి విగ్రహం ముందు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
మూడు రకాల ఆరాధనలు :- చిన్ని కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు. 1) సూర్యోదయానికి ముందు, 2) మధ్యాహ్నం వేళ, 3) అర్ధరాత్రి సమయంలో స్వామివారికి పూజలు చేస్తారు.
మొదటి ఆరాధన:- ఈ రోజు సూర్యోదయానికి ముందే కృష్ణుడిని పూజిస్తారు. ముఖ్యంగా ఉపవాసం చేసేవారు చిన్ని కృష్ణుడిని ఆరాధిస్తారు.
రెండో ఆరాధన:- మధ్యాహ్నం 12 గంటలకు ఈ పూజను ప్రారంభిస్తారు. మొదట నీరు తీసుకుని దేవకికి అర్పిస్తారు. తల్లి దేవకిని పూజించిన తర్వాత మాధవుడికి ప్రత్యేకంగా పూజ చేయాలి.
మూడో ఆరాధన:- ఇది అత్యంత ముఖ్యమైన పూజ. అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరుగుతుంది. ఎందుకంటే ఆ మురళీకృష్ణుడు జన్మించింది అర్ధరాత్రే. ఈ సమయంలో చిన్ని కృష్ణుడిని ఆరాధిస్తారు. తమ కోరికలను నియంత్రించుకుని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు.
కృష్ణుడికి ఎలాంటి నైవేద్యాలు నివేదన చేయాలి:- కృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. మొత్తం 56 రకాల నైవేద్యాలను అర్పిస్తారు. అయితే అందరికి 56 రకాల వంటలను ఆయనకు ఇవ్వడం కష్టం కాబట్టి దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. వీటి స్థానంలో వెన్నతో తయారు చేసి ఏదైన తీపి వంటకం లేదా వెన్నను శ్రీ కృష్ణుడికి సమర్పించవచ్చు. ఎందుకంటే కన్నయ్యకు వెన్నంటే అమితమైన ఇష్టం. ఫలితంగా మీరు ఎల్లప్పుడు సంతోషంగా ఉంచడమే కాకుండా ఆ మాధవుడు మీ కోరికలను తీరుస్తాడు.
ఉపవాసం వ్రతం:- ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీ కృష్ణుడీ లీలలు, కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేయాలి. స్వామికి సంబంధించి అష్టోత్తరం, బాలకృష్ణ స్తోత్రం, శ్రీ కృష్ణ సహస్రనామాలు, భాగవతంలోని దశమస్కందం చదవాలి. ఆలయంలో ఆష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి, ఐశ్వార్యాలు చేకూరుతాని పురాణాలు, పెద్దలు తెలియజేస్తున్నారు. స్కందపురాణం ప్రకారం ఈ రోజు మాధవుడిని అర్చిస్తే సకల పాపాలు తొలిగి మోక్షం లభిస్తుంది.
శ్రీ కృష్ణాష్టోత్తర శత నామావళి:-
ఓం కృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః ॥ 10 ॥
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా శంఖాంద్యుదాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునా వేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనా జీవితహరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజ జనానందినే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ॥ 20 ॥
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీత నవాహారాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగి మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్ధీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాం పతయే నమః ॥ 30 ॥
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం దేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తాలతాలభేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ॥ 40 ॥
ఓం ఇలాపతయే నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః ॥ 50 ॥
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం వృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషణాయ నమః ॥ 60 ॥
ఓం శ్యమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః
ఓం నరకాంతకాయ నమః ॥ 70 ॥
ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాల శిరశ్ఛేత్రే నమః
ఓం దుర్యోధన కులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః ॥ 80 ॥
ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విధ్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకాయ నమః
ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హావతంసకాయ నమః ॥ 90 ॥
ఓం పార్థసారథయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహోదధయే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం పన్నగాశన వాహనాయ నమః ॥ 100 ॥
ఓం జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్థపాదాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్థాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః ॥ 108 ॥
ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళీస్సమాప్తా ॥ జై శ్రీ కృష్ణ ..జై శ్రీమన్నారాయణ.