పిల్లలకు నెయ్యి పెడితే ఏమౌతుందో తెలుసా?
నెయ్యి పోషకాల భాండాగారం. దీనిలో లాక్టోస్ ఉండదు. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, బ్యూట్రిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇంతని పోషకాల నెయ్యిని పిల్లలలకు రోజూ పెడితే వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారి ఫుడ్ విషయంలో. పిల్లలకు ఆరు నెలల వయసు నుంచే పోషకాహారాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వయసులో పిల్లలకు ఏది మంచిదో? ఏది మంచిది కాదో? తెలుసుకోవాలి. పిల్లల ఎదుగుదల స్టార్ట్ అయ్యే సంవత్సరాల్లో విటమిన్లు, ప్రోటీన్లు మెండుగా ఉన్న ఆహారాలనే ఇవ్వాలి. నిజానికి పెద్దలతో పాటుగా పిల్లలకు కూడా నెయ్యి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. దీనిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. పిల్లలకు నెయ్యిని పెట్టడం వల్ల వారిలో మెదడు పెరుగుదల బాగుంటుంది. అలాగే వారు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
నెయ్యిలోని పోషక విలువలు వెన్నతో సమానంగా ఉంటాయి. దీనిలో లాక్టోస్ ఉండదు. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి లు అధిక మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీనిలోల మోనోశాచురేటెడ్ కొవ్వులు, లినోలెయిక్ ఆమ్లం, బ్యూట్రిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి.
నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే పిల్లలు ఘనాహారం తినడం మొదలుపెట్టిన వెంటనే వారికి తప్పకుండా నెయ్యిని పెట్టాలి. మీ బిడ్డకు ఏడు నెలల వయస్సు ఉన్నప్పుడు వారి ఆహారంలో మూడు నుంచి నాలుగు చుక్కల నెయ్యిని చేర్చొచ్చు. ఏడాది వయసు ఉన్న పిల్లలకు ఒక చెంచా నెయ్యిని వారి ఆహారంలో చేర్చాలని నిపుణులు చెబుతున్నారు.
నెయ్యి ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే కడుపు సమస్యలను దూరం చేస్తుంది. నెయ్యి కూడా పిల్లలకు మంచి శక్తి వనరు. ఇందులో సంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శక్తిని, స్టామినాను అందిస్తుంది. పిల్లల మెదడు మొదటి ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చెందుతుంది. నెయ్యిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. నెయ్యి బరువు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే వారి జీవక్రియను పెంచుతుంది.
అయితే పిల్లలకు ఇంట్లోనే తయారుచేసిన ఆవు నెయ్యిని పెట్టడం మంచిది. మీ పిల్లల చర్మం మరింత మృదువుగా నెయ్యితో బాడీ మసాజ్ చేయొచ్చు. దీనిని ఇలా కూడా ఉపయోగిస్తారు. ఇది వారు బలంగా, వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.