ధోని పై మళ్లీ విరుచకపడిన యువరాజ్ సింగ్ తండ్రి

బాస్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో యువరాజ్ సింగ్ కటక్ వన్డేలో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. మూడేళ్ల తర్వాత దొరికిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకొని సెంచరీతో అదరగొట్టాడు. తన కేరీర్ లోనే అత్యధిక వ్యక్తగత స్కోరు చేశాడు.

యూవీ ఇలా మూడేళ్ల తర్వాత జట్టులో తీవ్ర పోటీ ఉన్న అవకాశం దక్కించుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. కెప్టెన్ కోహ్లి ఒత్తడితోనే సెలక్టర్లు యూవీని జట్టులోకి ఎంపికచేశారన్నది తెలిసిందే.

అయితే ఇక్కడే యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసి ధోనిపై మళ్లీ నోరుపారేసుకున్నాడు.

ధోనీ వల్లే తన కొడుకు జట్టుకు దూరమయ్యాడని ఆరోపించాడు. అయితే ధోని తప్పును తాను క్షమిస్తున్నాని దేవుడు కూడా అతడిని క్షమించాలని కోరుకుంటున్నాని వ్యాఖ్యానించడం గమనార్హం.