చంద్రబాబు దీక్షకు చెక్ పెడుతున్న జగన్

చంద్రబాబు దీక్షకు చెక్ పెడుతున్న జగన్

వైసీపీ అధినేత జగన్ మరో మాష్టర్ ప్లాన్ వేశారు. హోదా కోసం ప్రయత్నం లో భాగంగా ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ దీక్ష ప్రతిఫలం ఆయనకు దక్కకుండా ఉండేందుకు జగన్ మాష్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం.

అసలు విషయం ఏమిటంటే... ప్రత్యేక హోదా అంశం చూట్టు ఏపీ రాజకీయాలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.  2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా నినాదాన్నే ప్రచారాస్త్రంగా మలచుకోవాలని టీడీపీ, వైసీపీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ఇరు పార్టీలు పోటా పోటీగా ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా మారిన తరుణంలో మైలేజీ పెంచుకునేందుకు టీడీపీ,వైసీపీలు పోటీపడుతున్నాయి.

ఢిల్లీ వేదికగా టీడీపీ, వైసీపీ ఎంపీలు ధర్నా, దీక్షలు చేస్తుండగా.. గల్లీ స్థాయిలో కూడా ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక అడగు ముందుకు వేసి తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక హోదా కోసం ఒక్క రోజు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే జరిగితే ప్రత్యేక హోదా క్రిడిట్ చంద్రబాబు ఖాతాలో పడుతుంది. దీన్ని నిలవరించేందుకు వైసీపీ సరికొత్త ఎత్తుగడ వేస్తోంది. చంద్రబాబు దీక్ష రోజే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని జగన్ నిర్ణయించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే హోదా పోరు పతాక స్థాయికి చేరడం ఖాయం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos