జగన్@100

జగన్@100

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 100కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలో జగన్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. మంగళవారం కర్నూలు జిల్లాలో అడుగుపెట్టిన ఆయన చాగల్లమర్రి వద్దకు చేరుకునే సమయానికి మొత్తం 100కిలోమీటర్లు పూర్తి చేశారు.

జగన్.. చాగల్లమర్రి చేరుకోగానే ఆయనకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. గత ఏడు రోజులుగా జగన్.. కడప జిల్లాలో పాదయాత్ర చేశారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో ప్రజలను కలుస్తూ వారి కష్టాలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే.. ప్రజల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. జగన్ 100కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos