జగన్ పై విమర్శలు కురిపించిన బాలకృష్ణ బాలయ్యకు కౌంటర్ ఎటాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ బాలయ్యను చీడపురుగుతో పోల్చిన వైసీపీ ఎమ్మెల్యే
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. జగన్ పై బాలకృష్ణ చేసిన కామెంట్స్ ని వైసీపీ ఎమ్మెల్యే తిప్పికొట్టారు.
అసలు విషయం ఏమిటంటే... గత మూడు రోజుల క్రితం.. బాలయ్య.. సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖ వెళ్లారు. అనంతరం నగరంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. జగన్ కొండను ఢీకొడుతున్నాడంటూ పేర్కొన్నారు. కాగా.. ఈ వాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్పందించారు. ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు తన మతిస్థిమితం బాలేదని బాలయ్య సర్టిఫికెట్ తెచ్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి బాలకృష్ణకు జగన్ ని విమర్శించే అర్హత లేదన్నారు. అంతేకాదు.. బాలయ్య ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటారని విమర్శించారు. అందుకే చాలా మంది బాలయ్య కార్యక్రమాలకు వెళ్లడానికి భయపడుతున్నారని చెప్పారు.
ఎన్టీఆర్ వంటి మహానుభావుడి కడుపునపుట్టిన చీడపురుగు బాలకృష్ణ అని విమర్శించారు. తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వెనకాల తిరగడం ఒక్క బాలకృష్ణకే చెల్లుతుందన్నారు. పులికడుపున పులే పుడుతుందనడానికి జగన్ నిదర్శనమన్నారు. ఇంకోసారి జగన్ ని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
