అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.  ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్  రెడ్డి వర్గీయులకు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. పోలీసులు కూడా జేసీ వర్గీయులకే మద్దతు పలికారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

 అసలు విషయం ఏమిటంటే.. తాడిపత్రిలో హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీనివల్ల స్థానిక ప్రజలు మద్యానికి బానిసలౌతున్నారని..దీనిని మూసివేయాలని గత కొంతకాలంగా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఆ బార్ రెండ్ రెస్టారెంట్ ని మూసివేయాలంటూ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్  రెడ్డి వర్గీయులు మాత్రం బార్  యజమానులకు మద్దతుగా నిలిచారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వైసీపీ నేత  పెద్దిరెడ్డి, ఇతర నేతలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. వివాదం కొనసాగుతోంది.