ఉద్యోగులంటే అంత చులకనా?

ఉద్యోగులంటే అంత చులకనా?

ఉద్యోగులంటే ప్రభుత్వానికి అంత చులకనా? అని వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రశ్నించారు. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. బుధవారం ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును వైసీపీ ప్రశ్నించింది. ఇదే విషయంపై వైసీపీ నేత పార్థసారధి బుధవారం మీడియాతో మాట్లాడారు. పెన్షన్ అనేది ప్రతి ఉద్యోగి హక్కు అని పార్థసారధి గుర్తు చేశారు. ఉద్యోగులు జీతాలు పెంచమని కోరలేదని, కేవలం పెన్షన్ విధానాన్ని మాత్రమే మార్చాలని కోరుతున్నారని చెప్పారు.

చంద్రబాబు ప్రభుత్వ విధానం మొదటి నుంచి కార్పొరేట్ సంస్థలకే అనుకూలమని ఆయన ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఉద్యోగ వ్యతిరక విధానాలను అవలంభించారన్నారు. ఉద్యోగుల పోరాటానికి వైసీపీ మద్దతు ఇస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos