అవన్నీ వాస్తవాలు కావు

యాంకర్, సినీ నటి శ్రీరెడ్డితో తమ వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఈ రోజు ఉదయం నుంచి శ్రీరెడ్డి మరో యువతితో మాట్లాడిన ఆడియో టేపు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ వీడియో టేపులో వైసీపీ నేతలే ఈ విధంగా చేశారంటూ శ్రీరెడ్డి చెబుతున్నట్లుగా ఉంది. దీంతో శ్రీరెడ్డి ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్ ని లాగడానికి వైసీపీ నేతల హస్తం ఉందనే ప్రచారం ఊపందుకుంది.
కాగా.. ఈ ప్రచారంపై అంబటి రాంబాబు స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఆయన అన్నారు. తమ పార్టీకి శ్రీరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని.. ఆమె ఉద్యమంలో తామ పార్టీ నేతలు ఎవరూ జోక్యం చేసుకోలేదని ఆయన గురువారం మీడియా ముందు తెలియజేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred