రెడ్ మీ నోట్4 ధర తగ్గింది..!

First Published 13, Nov 2017, 5:38 PM IST
Xiaomi Redmi Note 4 India Price Cut
Highlights
  • ధర తగ్గిన రెడ్ మీ నోట్ 4
  • రూ.1000 తగ్గించిన కంపెనీ

చైనా కంపెనీకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ. ఈ కంపెనీ తన రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఈ ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ధరలో అందరికీ అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధరను మరో రూ.1000 తగ్గించింది. ఈ విషయాన్ని భారత్ లోని షియోమీ కంపెనీ హెడ్ మను కుమార్ జైన్ తెలిపారు. ఈ ఫోన్ ని తొలుత విడుదల చేసిన సమయంలోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తాజాగా మరో రూ.1000 తగ్గించడంతో మరింత ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.

రెడ్‌మీ నోట్‌4 3జీబీ ర్యామ్‌/32జీబీ వేరియంట్‌  ఫోన్ ధర రూ10,999, 4జీబీ ర్యామ్‌/64జీబీ వేరియంట్‌ రూ.12,999 ఉండగా.. రెండు వేరియంట్లపై చెరో వెయ్యి రూపాయలు తగ్గింది. ఎంఐ.కామ్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సైట్లలో కూడా తగ్గింపు ధరకే ఈ ఫోన్‌ లభిస్తోంది. దీనికి తోడు ఫ్లిప్‌కార్టులో ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజీ ఆఫర్లతో పాటు, క్రెడిట్‌ కార్డు కొనుగోలుపై ఆఫర్లు ఉన్నాయి. తమ పాత ఫోన్‌ను మార్చుకునే వారికి రూ.11వేలు వరకు ఎక్ఛేంజీ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుండగా.. యాక్సిస్‌బ్యాంక్‌ బజ్‌ క్రెడిట్‌ కార్డులపై 5 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. వడ్డీలేని ఈఎంఐ సదుపాయాన్ని కూడా కొనుగోలుదారులకు కల్పిస్తోంది.

రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు..

5.50 ఇంచెస్ టచ్ స్క్రీన్

4జీబీ ర్యామ్

64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ

ఫ్రంట్ కెమేరా 5మెగా పిక్సెల్

వెనుక కెమేరా 13మెగా పిక్సెల్

ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్

loader