Asianet News TeluguAsianet News Telugu

పోలీసు కంప్యూటర్లకు వైరస్

ఒక్కసారిగా కొన్ని వేల కంప్యూటర్లు పనిచేయటం మానేయటంతో ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. కారణమేమంటని ఆరాతీసిన ఉన్నతాధికారులకు షాక్ కొట్టే వార్త తెలిసింది. తమ సిస్టమ్స్ హ్యాక్ అయినట్లు తెలుసుకున్నారు.

Wyncy virus attacks police computers

రాష్ట్ర పోలీసులకు పెద్ద తలనొప్పి మొదలైంది. శాఖలోని దాదాపు కంప్యూటర్లన్నీ ఒకేసారి పనిచేయటం మానేసాయి. ఒక్కసారిగా కొన్ని వేల కంప్యూటర్లు ఒకేసారి పనిచేయటం మానేయటంతో ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. కారణమేమంటని ఆరాతీసిన ఉన్నతాధికారులకు షాక్ కొట్టే వార్త తెలిసింది. తమ సిస్టమ్స్ హ్యాక్ అయినట్లు తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని పోలీసు కంప్యూటర్లు మాత్రమే కాదని మొత్తం దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని కంప్యూటర్ల పరిస్ధితీ ఒకే విధంగా ఉందని తెలిసింది. కంప్యూటర్లకు వైరస్ సోకటంతో కంప్యూటర్లన్నీ పనిచేయటానికి మొరాయిస్తున్నాయి. మరింత క్షుణ్ణంగా పరిశోధించే సరికి ‘విన్సీ’ అనే సరికొత్త వైరస్ ఎటాక్ అయిందని తెలిసి నివ్వెరపోయారు.

గతంలో ఎన్నడూ ఇటువంటి అనుభవం ఎదురుకాకపోవటంతో ఏం చేయాలో పోలీసు ఉన్నతాధికారులకు అర్ధం కావటం లేదు. కంప్యూటర్లలోని వేలకొద్దీ ఫైళ్ళు ఒక్కసారిగా మాయమైపోయాయి. పోలీసు ఉన్నతాధికారుల అంచనా ప్రకారం మొత్తం 74 దేశాల్లోని పోలీసు శాఖకు చెందిన కంప్యూటర్లకు ఒకే విధమైన వైరస్ సోకిందని తెలిసింది. ఇది సంఘవిద్రోహ శక్తుల పనే అని అనుమానిస్తున్నారు.

రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతి, మచిలీపట్నం, ఏలూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన కంప్యూటర్లు పనిచేయటం లేదు. విండోస్ వాడుతున్న కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. పనిచేయకుండా మొరాయిస్తున్న కంప్యూర్ల సమస్యను డీకోడ్ చేయటానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయమై డిజిపి సాంబశివరావు మాట్లాడుతూ కంప్యూటర్లు హ్యాక్ అయిన మాట వాస్తవమేనన్నారు. ఆండ్రాయిడ్ వెర్షన్ వాడుతున్నందున తన కంప్యూటర్ హ్యాక్ కాలేదన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios