ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ సంచలన నిర్ణయం
మహిళలపై అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు ఇకపై కత్తులతో తిరుగొచ్చు.
మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
అయితే వారు తీసుకెళ్లే కత్తి నాలుగు అంగుళాల మాత్రమే ఉండాలట. అలాగే, లైటర్లు, అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్లొచ్చు.
నిర్భయ ఘటన తర్వాత దేశ రాజధానిలో మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకున్నారు.
అయితే ఇటీవల బెంగళూరు ఘటన తర్వాత ఢిల్లీ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది.
దిల్లీ మెట్రోల్లో రోజుకు 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో దాదాపు సగంమంది మహిళలే ఉంటున్నారు. మహిళల భద్రతకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
