వరంగల్ కానిస్టేబుల్ ను కొట్టిచంపిన భార్య

First Published 22, Apr 2018, 3:07 PM IST
wife kills husband in warangal district
Highlights

మద్యం మత్తులో భర్త గొడవపడటంతో దాడి

వరంగల్ జిల్లాలో భార్యా భర్తల మద్య జరిగిన గొడవ భర్తను బలితీసుకుంది. మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ భార్యతో గొడవకు దిగడంతో అతన్ని అదుపుచేయడానికి ఆమె కర్రతో దాడి చేసింది. అది కాస్తా సున్నితమైన ప్రాంతంలో తాకడంతో కానిస్టుబుల్ మఈతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ మండలం మామునూరుకు చెందిన హన్మకొండ గిరి(40) వరంగల్‌ మామూనూర్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడికి 2004లో ఉద్యోగం రాగా అదే ఏడాది శివరంజనితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గిరి గత కొద్ది కాలంగా మద్యానికి బానిసై  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో ఈ విషయంపై భార్య భర్తలకు మద్య గొడవలు జరుగుతున్నాయి.

ఇలాగే ఈ నెల 16 వ తేదీన ఫులల్ుగా మందు తాగి ఇంటికి వచ్చిన గిరి భార్యతో గొడవకు దిగాడు. ఇంట్లోని వస్తువులను పగలగొడుతూ భర్త హంగామా చేస్తుండటంతో అతడిని అదుపు చేయాలని భార్య కర్రతో దాడి చేసింది. అది కాస్తా భర్త సున్నితమైన ప్రాంతంలొ తగ్గలడంతో తీవ్ర రక్త స్రావమైంది. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు.  

వెంటనే గిరి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ గిరి  మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు భార్య శివరంజనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ కుమార్‌  తెలిపారు.

 

loader