Asianet News TeluguAsianet News Telugu

దీపక్ రెడ్డిని టిటిపి నుంచి సస్పెండ్ చేస్తున్నారా?

అనంతపురానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ  దీపక్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.  భూముల కాజేయడానికి సంబంధించి అనేక సీరియస్ నేరాల కింద దీపక్  రెడ్డిని హైదరాబాద్   పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పార్టీలో నేర చరితులకు చోటు ఉండదు అనే చాటి చెప్పుకునేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయుడు యోచిస్తున్నట్లు సమాచారం.

why naidu delaying suspension of party mlc deepak reddy

అనంతపురానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ  దీపక్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.  భూముల కాజేయడానికి సంబంధించి అనేక సీరియస్ నేరాల కింద దీపక్  రెడ్డిని హైదరాబాద్   పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పార్టీలో నేర చరితులకు చోటు ఉండదు అనే చాటి చెప్పుకునేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయుడు యోచిస్తున్నట్లు సమాచారం.  చర్య తీసుకునే విషయం గురించి చంద్రబాబు జిల్లా మంత్రులిద్దరిని సంప్రదించినట్లు తెలిసింది. కాలువ శ్రీనివాస్, పరిటాల సునీత ఇద్దరు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియచేశారని విశ్వసనీయ సమాచారం.కాలువ శ్రీనివాస్ రాయదుర్గం ఎమ్మెల్యే. 2012 టిడిపి తరఫున ఉప ఎన్నికల్లో పోటీచేసి దీపక్ రెడ్డి ఓడిపోయారు.

సిబిఐ దాడులు జరిగిన వెంటనే నెల్లూరు పార్టీ ఎమ్మెల్సీని  వాకాటి నారాయణ రెడ్డిని  పార్టీ అధ్యక్షుడు సస్పెండ్ చేశారు. ఇదేవిధంగా దీపక్ రెడ్డిని కూడా సస్సెండ్ చేయకోతే, చెడ్డపేరు వస్తుందని వారు భావిస్తున్నారు. దీపక్ రెడ్డిని సస్సెండ్ చేయడానికి, ఇపుడు రాయలసీమలో పార్టీకి పెద్దదిక్కుగా తయారయిన అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి పలుకుబడి ఉపయోగించే అవకాశం ఉంది. దీనివల్లే, దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయడం జాప్యం అవుతూ ఉందని అనంతపురం జిల్లా లో తెలుగుదేశం నేతలనుకుంటున్నారు. దీపక్ రెడ్డి జెసికి మేనల్లుడు. నిజానికి చంద్రబాబు నుంచి ఇలాంటి ప్రకటన కోసం జిల్లాలో చాలా మంది టిడిపినేతలు ఎదురుచూస్తున్నారు.

దీపక్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లావాడే. ఆయన రాజకీయాలు అనంతపురం, దందాలు హైదరాబాద్. 2012 లో టిడిపిలో చేరారు. నిజానికి అనంతపురం  జిల్లా టిడిపిలో  చాలా మంది దీపక్ రెడ్డి మీద చర్య తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, జాప్యం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నవనిర్మాణ దీక్ష ల వల్ల జాప్యం అవుతూ ఉందని సర్ది చెప్పుకుని సంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే, జిల్లా రాజకీయాలలో దీపక్ రెడ్డి లాంటి వారి వల్ల డబ్బు ప్రాబల్యం పెరగి పోతుందని వారి భయం. ఈయన మీద చర్య తీసుకుని చంద్రబాబు అవినీతికి వ్యతిరేకమని చెబుతున్న మాటని అచరణ లోపెట్టాలని అంటున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios