Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్లుగా బాబును పీడిస్తున్న అనుమానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  జూన్ రెండో తేదీ అంటే అసహ్యం. జూన్ రెండో తేదీన నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ జరుపుకోవడం ఏమాత్రం ఇష్టంలేదు. ఆ రోజు ఏమాత్రం మంచిరోజు కాదని భావిస్తున్నారు.   జూన్ రెండో తేదీని ఆయన ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా?

why andhra chief minister naidu hates june 2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  జూన్ రెండో తేదీ అంటే అసహ్యం. జూన్ రెండో తేదీన నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ జరుపుకోవడం ఏమాత్రం ఇష్టంలేదు. ఆరోజు ఏమాత్రం మంచి రోజు కాదని భావిస్తున్నారు. జూన్ రెండో తేదీని ఆయన ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా?

 

ఆ రోజు ఇటలీ స్వాతంత్య్ర దినం, ఆ రోజున కావాలనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీ రాష్ట్ర విభజన చేశారనే అనుమానం ఆయన్ని పీడిస్తున్నది.  ఇలాంటి రోజున నవ్యాంధ్ర అవతరణఎలాజరుపుకోవాలని  ముఖ్యమంత్రి  ఆవేదన చెందుతున్నారు. ఈ అనుమానంతో నే ఆయన నవ్యాంధ్ర అవరణను మనసారా జరపుకోలేకపోతున్నారట.

 

 ‘రాష్ట్ర అవతరణ ఏరోజు అని జరుపుకోవాలి;  జూన్ 2న మాత్రమే రాష్ట్ర అవతరణ అని చెప్పాలి. అయితే అది మంచిరోజుగా భావించాలా ? రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆరోజున జరుపుకుంటామా?  విచిత్రమైన పరిస్థితులు మనకున్నాయి,’ అని ఆయన ఈ రోజు అన్నారు.

 

ఈ రోజు వెలగపూడిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన విభజన గురించి విపరీతంగా బాధపడ్డారు.

 

అన్నీ అవాస్తవాలు చూపి రాష్ట్ర విభజనచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

‘విభజన సమయంలో చేసినవన్నీ అవాస్తవాలా.. యుద్ధ విమానంలో బిల్లు పంపించడం అవాస్తవమా..? పార్లమెంటు తలుపులు వేసి బిల్లును ఆమోదించడం అవాస్తవమా? వార్ రూమ్ చర్చలు జరపడం అవాస్తవమా..? ఇటలీ అవతరణ దినోత్సవం నాడు రాష్ట్రాన్ని నిలువునా చీల్చడం అవాస్తవమా..ఇవన్నీ మరచిపోవాల్సిన విషయాలా?’ అని ఆయన ప్రశ్నించారు.

 

ఆయనకు ఈ రోజు రాష్ట్ర విభజన పూనకం వచ్చేసింది. ఈ పూనకం మధ్య  ఒక భీష్మ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఎవరైతే  రాష్ట్రాన్ని విభజించారో వాళ్లు సిగ్గుపడేలా అమరావతి ని అభివృద్ధిచేసి చూపిస్తానని చెప్పారు.

 

‘హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించాలంటే రు.5 లక్షల కోట్లు వ్యయం అవుతుంది,’ అని చెబుతూ ‘’పదేళ్లలో మీరు చూస్తారు. హైదరాబాదులో పదేళ్లలో ఊపు తెచ్చాం. ఇప్పుడు కూడా మరో పదేళ్లలో అభివృద్ధి చూస్తారు,’ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios