సమాజ్ వాదీ పార్టీలో సైకిల్ సంక్షోభం
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు సైకిల్ చుట్టు తిరుగుతున్నాయి. తండ్రీకొడుకులు గుర్తు కోసం నానా కష్టాలు పడుతున్నారు. చివరికి వారి పంచాయితీ ఎన్నికల సంఘం వరకు వెళ్లింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ గుర్తు అయిన సైకిల్ ను తమకే కేటాయించాలని తండ్రి, కొడుకుల వర్గీయులు ఈసీని కలిశాయి.
అయితే ఇలా సైకిల్ గుర్తు పై పోరాటం ఎస్పీ పార్టీలోనే కాదు... గతంలో టీడీపీ లోనూ జరిగింది.
చంద్రబాబు వెన్నుపోటు తర్వాత టీడీపీ రెండుగా చీలిపోవడంతో పార్టీ గుర్తు ఎవరికి దక్కాలనేదానిపై పెద్ద పోరాటమే జరిగింది.
చివరకు ఈ సమస్య ఈసీ కి... అటునుంచి కోర్టు వరకు వెళ్లింది. అలాంటి విపత్కర పరిస్థితిలో చంద్రబాబు వెన్నంటే ఉన్నారు సినీ నటి జయప్రద.
కోర్టు తీర్పుతో సైకిల్ గుర్తు చంద్రబాబు చెంతకు చేరింది. ఆ సైకిల్ తోనే 9 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో దూసుకెళ్లారు చంద్రబాబు.
ఇప్పుడు ఎస్పీలోనూ అదే గుర్తు సమస్య వచ్చిపడింది. ఇక్కడ వృద్ధ నేత ములాయం వైపు జయప్రద నిలబడుతున్నారు.
ఆయనకు మద్దతుగా విదేశాల నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన జయప్రద ... అమరసింగ్ తో కలసి సైకిల్ గుర్తు తమకే కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
మరి, చూడాలి ఇక్కడ కూడా జయప్రద సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో...
