Asianet News TeluguAsianet News Telugu

నయీమ్ కేసులో తిమింగలాలు తప్పించుకున్నట్లేనా?

ఉన్నతస్ధాయిలోని వ్యక్తులు పలువురు నయీమ్ ను అడ్డుపెట్టుకుని చవకగా ఫాం హౌసులు, ఎకరాలకొద్దీ భూములను, కిలోల కొద్దీ బంగారాన్ని, విదేశీ పర్యటనలకు అవసరమైన డబ్బును, మరెన్నో భవంతులను గిఫ్టులుగా తీసుకున్నారని ప్రచారం జరిగింది. అటువంటి వా ళ్ళ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు

where are the top cop friends of gangster nayeem

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో తిమింగలాలను వదిలేసి కేవలం చేపలను మాత్రమే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్నదా? అన్న అనుమానం వస్తోంది అందరికీ. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించిన నయీమ్ కేసులో ప్రభుత్వం ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే కదా? అయితే, సస్పెండ్ అయిన వారిలో అదనపు ఎస్పీ, ఇద్దరు ఎసీపీ స్ధాయి అధికారులతో పాటు డిఎస్పీ, ఇన్ స్పెక్టర్లున్నారు. అయితే, ఇక్కడే పలువురికి అనుమానం వస్తోంది. ఎందుకంటే, మొదటి నుండి నయీమ్ కేసులో ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగానే ఉంది. ఉన్నతాధికారులనే వదిలేసి తమపై చర్యలు తీసుకోవటాన్ని సస్పెండ్ అయిన అధికారులు తప్పపడుతున్నారు.

నయీమ్ లాంటి గ్యాంగ్ స్టర్ ను సంవత్సరాలపాటు పెంచి పోషించటమంటే మామూలు విషయం కాదు. అత్యున్నతస్ధాయి వ్యక్తుల మద్దతు లేకుండా కేవలం దిగువస్ధాయి అధికారులు మాత్రమే చేయలేరు. నయీమ్ ఎన్ కౌంటర్ వెలుగు చూసినపుడు పలువురు పోలీసు ఉన్నతాధికారుల పాత్రపైన కూడా ప్రచారం జరిగింది. పలువురు డిఐజి, ఐజి, డిజిపిస్ధాయి వ్యక్తుల పాత్రపైన కూడా ఎన్నో అనుమానాలు తొంగిచూసిన సంగతి మరచిపోకూడదు.

అందుకనే, ఉద్యోగ విరమణ చేసిన ఉన్నతస్ధాయి పోలీసు బాసులే స్వయంగా నయీమ్ తో తమకు ఎటువంటి సంబంధాలూ లేవని కూడా క్లాలిరిఫికేషన్ ఇచ్చుకోవటం గమనార్హం. అటువంటిది ప్రభుత్వం కేవలం ఏఎస్సీ, ఇద్దరు ఏసిపి, ముగ్గురు డిఎస్పీ స్ధాయి అధికారులపై మాత్రమే చర్చలు తీసుకోవటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 20 మంది పోలీసు అధికారులను విచారించిన ప్రత్యేక విచారణ బృందం మరి అందరినీ వదిలేసి కేవలం ఐదుగురి పాత్రను మాత్రమే గుర్తించిందా? విచారించిన వారిలో కూడా పలువురుని వేకెన్సీ రిజర్వ్ లో ఉంచాలని డిజిపి ఆదేశించారు. వారంతా ఏ స్ధాయి అధికారులో స్పష్టంగా ప్రకటిస్తే బాగుంటుంది.

నయీమ్ కేసులో తాము తప్పించుకోవటానికి, తమను అసలు విచారణ పరిధిలోకే చేర్చకూడదని పలువురు ఉన్నతాధికారులు పెద్దఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నయీమ్ కేసులో ఎవరిపైనా చర్యలు తీసుకోకపోతే మొత్తం విభాగానికే చెడ్డపేరు వస్తుందన్న భయంతోనే ఏదో మొక్కుబడిగా కొందరిపై మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇపుడు సస్పెండ్ అయిన వారితో పాటు మరికొందరు ఉన్నతాధికారులు కూడా నయీమ్ నుండి బోలేడు గిఫ్టులు తీసుకున్నట్లు అధికారపార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతస్ధాయిలోని వ్యక్తులు పలువురు నయీమ్ ను అడ్డుపెట్టుకుని చవకగా ఫాం హౌసులు, ఎకరాలకొద్దీ భూములను, కిలోల కొద్దీ బంగారాన్ని, విదేశీ పర్యటనలకు అవసరమైన డబ్బును, మరెన్నో భవంతులను గిఫ్టులుగా తీసుకున్న పలువురు పోలీసు బాసులపై ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. మరి అటువంటి ఉన్నతాధికారులపై ఇక చర్యలు లేనట్లేనా? లేకపోతే కొద్దిమంది పోలీసు బాసులను రక్షించేందుకే దిగువస్ధాయి అధికారులను బలిపశువులను చేసారా? అన్న అనుమానాలకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

Follow Us:
Download App:
  • android
  • ios