Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పెళ్లికి ‘సుప్రీం’ మద్దతు

  • వారి పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు గానీ, పంచాయితీ పెద్దలుగానీ జోక్యం చేసుకునే హక్కులేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
When 2 Adults Get Married No One Can Interfere

మన దేశంలో చాలా మంది ప్రేమలు.. పెళ్లి పీటలు ఎక్కకముందే ఆగిపోతాయి. యువతీయువకులిద్దరూ మేజర్లైనా.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోని కారణంగా చాలా మంది వారి ప్రేమను కాదనుకున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే.. ఇక  నుంచి ఆ సమస్య ఉండదు. ప్రేమించుకున్న యువతీయువకులు ఇద్దరూ మేజర్లు అయితే.. వారి ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. వారి పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు గానీ, పంచాయితీ పెద్దలుగానీ జోక్యం చేసుకునే హక్కులేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్.. సోమవారం ఈ మేరకు వెల్లడించింది. ‘పరువు హత్య’లను అరికట్టాలనే అంశంపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వివాహం చేసుకున్న ఇద్దరూ మేజర్లు అయితే.. వారి విషయంలో తలదూర్చే హక్కు థర్డ్ పార్టీకీ లేదు. వారు తల్లిదండ్రులు, సమాజం, పంచాయతీలు ఇంకెవ్వరైనా కావొచ్చు. వయోజనులైన ఇద్దరు యువతీ యువకులు పెళ్లి చేసుకోవాలనుకోవడం, కలిసి జీవించాలనుకోవడం వారి స్వేచ్ఛా హక్కు కిందకు వస్తుంది’ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

పరువు హత్యలు, ఆ తరహా నేరాలను అరికట్టాలంటూ ‘శక్తి వాహిని’ అనే ఎన్జీవో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న జంటలను ఉత్తర భారతదేశంలో.. ముఖ్యంగా హరియాణాలో ఖాప్‌ పంచాయితీలు, గ్రామాల్లో సొంతగా ఏర్పాటు చేసుకున్న న్యాయవ్యవస్థలు చట్ట వ్యతిరేకమైన విధానాలతో దారుణంగా శిక్షిస్తున్నాయి, వాటిని అడ్డుకోవాలని పిటిషన్‌ వేయగా.. న్యాయస్థానం పైవిధంగా తీర్పు వెలువరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios