ఫిబ్రవరిలోనే ప్రకటించిన కంపెనీ

సమయం లేదు మిత్రమా.. మీ వాట్సాప్ ను అపడేట్ చేస్తారా... అవుట్ డేట్ చేస్తారా తేల్చుకోండి. ఎందుకంటే కొన్ని మొబైల్ లలో వాట్సాప్ సేవలు ఈ రోజుతో ముగిసిపోనున్నాయి.

రేపు న్యూ ఇయర్ విషెస్ ను మీ వాట్సప్ ఎవరికీ పంపించకపోవచ్చు. కాబట్టి మీ ఫోన్ ను ఒకసారి సరిచూసుకోండి .

సింబియన్, బీబీఓఎస్, విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ తదితర ప్లాట్ ఫాంలపై పనిచేసే కొన్ని ఫోన్లలలో వాట్సాప్ పనిచేయదని ఫిబ్రవరిలోనే వాట్సాప్ సంస్థ ప్రకటించింది.

తాము తెచ్చిన కొత్త ఫీచర్లను ఈ ప్లాట్ ఫాంలపై పనిచేసే కొన్ని ఫోన్లు సపోర్టు చేయడం లేదని తెలిపింది. 2017 నుంచి అలాంటి ఫోన్ల లలో వాట్సాప్ పనిచేయదని పేర్కొంది. 

కాగా, ఇన్స్టెంట్ మేసేజింగ్ యాప్ గా ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

వాట్సాప్ యూజర్లలలో భారత్ వాటా దాదాపు 16 శాతంగా ఉండడం గమనార్హం. ఇటీవల వీడియో కాల్ సౌలభ్యాన్ని కూడా వాట్సాప్ భారత్ నుంచే ప్రారంభించడం తెలిసిందే.