ఫేస్ బుక్ కు మరో షాక్: వాట్సాప్ సిఈవో రాజీనామా

Whatsapp CEO Jan Koum quits Facebook
Highlights

ఫేస్ బుక్ కు మరో షాక్ తగిలింది. ఫేస్ బుక్ తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ఫేస్ బుక్ వాట్సాప్ సిఈవో జాన్ కౌమ్ సోమవారం తెలిపారు.

శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్ బుక్ కు మరో షాక్ తగిలింది. ఫేస్ బుక్ తో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ఫేస్ బుక్ వాట్సాప్ సిఈవో జాన్ కౌమ్ సోమవారం తెలిపారు. వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడుతు్నట్లుు ఆరోపణను ఎదుర్కుంటున్న ఫేస్ బుక్ కు ఇది మరో షాక్.

తాము ఫేస్ బుక్ నుంచి తప్పుకుంటున్నట్లు జాన్ కౌమ్ సోమవారం ఫేస్ బుక్ పేజీలో అధికారికంగా ప్రకటించారు. ఫేస్ బుక్ బోర్డు నుంచి కూడా కౌమ్ తప్పుకుంటున్నట్లు అమెరికా మీడియా రాసింది. అయితే, ఫేస్ బుక్ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు.

తాను ఎందుకు తప్పుకుంటున్నాననే విషయంపై కౌమ్ కారణాలు చెప్పలేదు. వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవడానికి వాట్సాప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అమెరికా మీడియా తెలిపింది. 

సామాజిక మాధ్యమాల్లో మాదిరిగా వాట్సాప్ లో ప్రకటనలకు అవకాశం ఉండదు. వినియోగదారుల దృష్టిని ప్రకటన మీదికి మళ్లించేందుకు ఫేస్ బుక్ కొన్ని నియమాలను పాటిస్తూ వస్తోంది. ఫేస్ బుక్ సమాచార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలపై ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ఇటీవల పలు మార్లు స్పందించారు. జరిగిన పొరపాటుకు క్షమాపణ కూడా చెప్పారు. 

loader