Asianet News TeluguAsianet News Telugu

లెక్క తప్పింది

మరి రద్దైన కరెన్సీ మొత్తం బ్యాంకులకు తిరిగి వచ్చేస్తే దేశంలో నల్లధనం ఎక్కడుంది?

what did center achieved by demonetization

నల్లధనం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి లెక్క పూర్తిగా తప్పింది. రద్దైన కరెన్సీ విలువకు దాదాపు సమాన కరెన్సీ తిరిగి బ్యాంకులకు వచ్చేసింది. దాంతో  నల్లధనం విషయంలో ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో కేంద్రానికి అర్ధం కావటం లేదు.

 

నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ చెప్పిన ప్రధాన కారణాల్లో దేశంలో పేరుకుపోయిన నల్లధనం కూదా ఒకటి. ప్రభుత్వ అంచనా ప్రకారం దేశంలో సుమారు రూ. 4 లక్షల కోట్ల నల్లధనముంది.

 

పెద్ద నోట్ల రద్దుతో లెక్కల్లో చూపలేని రూ.4 లక్షల కోట్లు లాభం వచ్చినట్లే అని కేంద్రం అంచనా వేసింది. రద్దై కరెన్సీ విలువ రూ. 15.5 లక్షల కోట్లైతే ఇప్పటికి రూ. 15 లక్షల కోట్లు బ్యాంకులకు తిరగివచ్చేసింది.

 

మిగిలిన రూ. 50 వేల కోట్ల పాత నోట్లు తిరిగి రావటానికి ఇంకా ఆరుమాసాల సమయం ఉంది. విదేశాల్లో ఉన్నవారు తమ వద్ద ఉన్నపాత నోట్లను రిజర్వ్ బ్యాంకుల్లో జమ చేయటనాకి చివరి గడువు మార్చి 31. ప్రవాస భారతీయులకైతే జూన్ నెలాఖరు. అప్పటికి మిగిలిన రూ. 50 వేల కోట్లూ వచ్చేస్తుందని తాజాగా కేంద్రం లెక్కలు కడుతోంది.

 

మరి రద్దైన కరెన్సీ మొత్తం బ్యాంకులకు తిరిగి వచ్చేస్తే దేశంలో నల్లధనం ఎక్కడుంది? నోట్లు రద్దైన వద్ద నుండి ఐటి, ఈడి శాఖలు జరిపిన దాడుల్లో పట్టుబడ్డ  డబ్బు సుమారు రూ. 5 వేల కోట్లు. అంటే రద్దైన మొత్తం కరెన్పీ విలువలో పట్టుబడ్డది 1 శాతం కూడా లేదు.

 

దేశంలో నగదు రూపంలో ఉండే నల్లధనం విలువ సుమారు 4 శాతం కన్నా ఉండదని మొదటి నుండి ఆర్ధిక నిపుణులు చెబుతూనే ఉన్నారు.

 

అయితే, ఇక్కడే జనాలకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. నల్లధనం విషయంలో నిపుణులు చెబుతున్న లెక్కలు ప్రభుత్వానికి తెలియనవి కావు. తెలిసీ మరి ఎందుకు పెద్ద నోట్లను రద్దు చేసింది? ప్రధాని చెబుతున్న ఇతర కారణాల్లో ఉగ్రవాదాన్ని నియంత్రించటం మరోటి. నోట్ల రద్దుకు ముందు తీవ్రవాదులు ఎలా విరుచుకుపడుతున్నారో నోట్ల రద్దు తర్వాత కూడా కొనసగుతూనే ఉంది.

 

చివరది దొంగనోట్లు. దొంగనోట్ల శాతం కూడా చాలా తక్కువని తేలిపోయింది. అంటే ప్రధాని చెప్పిన మూడు కారణాల్లోనూ పస లేదని తేలిపోయింది. ఇదంతా ప్రతిపక్షాల లెక్క కాదు సుమా! స్వయానా ప్రభుత్వం చెబుతున్న లెక్కలే.

 

మరి పెద్ద నోట్ల రద్దుతో కేంద్రం సాధించింది ఏమిటి?  కోట్లాది సామాన్య జనాలను నానాయాతనలకు గురిచేయటం. దేశ ఆర్ధిక వ్యవస్ధను నాశనం చేయటం. సుమారు 200 మంది ఉసురు తీయటం. చూద్దాం ప్రభుత్వం ఇపుడు ఏమి చెబుతుందో.

Follow Us:
Download App:
  • android
  • ios