ప్రాణం పోయినా పార్టీని వీడం

ప్రాణం పోయినా పార్టీని వీడం

ప్రాణం పోయినా తాము పార్టీని వీడే ప్రసక్తి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఇద్దరూ స్పందించారు.

 తాము వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నామంటూ అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే సంస్కృతి తమది కాదన్నారు. తమను పార్టీలోకి తీసుకునేందుకు టీడీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినప్పటకీ తాము భయపడటం లేదని స్పష్టం చేశారు. జగన్ పాదయాత్రను బలహీన పరచాలనే ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.. ప్యారడైజ్‌ పేపర్స్‌ విషయంలో జగన్‌పై అవినీతి ఆరోపణలు చేసిన మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణానదిలో బోటు ప్రమాదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు  బాధ్యత వహించాలన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos