Asianet News TeluguAsianet News Telugu

ఇండియా తొలి వివిఐపి చెట్టు, భారం ఏటా రు 12 లక్షలు

  • నాటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్ష  నాటడంతో ఇది వివిఐపి చెట్టయింది
  • ఇపుడిది ఏటా రు. 12 లక్షలు ఆర్థిక భారమయింది 
  • రేయింబగలు కాపాడనందుకు హోంగార్డులు, నీళ్ల టాంక్, ఒక వృక్ష వైద్యుడు

 

vvip tree puts burden of Rs 12 crore a year on madhya pradesh

అది చెట్టు కావచ్చు, మన నాయకుడు కావచ్చు, వివిఐపి పేరొచ్చిందంటే చాలు,ఎంత దర్జా దొరకుతుందో, చెప్పలేం. మనం ఇంతవరకు సాయుధ భటులు కాపలా ఉండే వివిఐపిలను చూశాం. అన్ని హంగులతో వెలుగుతూ ఉండే, అమేధీ, రాయ్ బరేలి, బారామతి,హాజీ పూర్  పులివెందుల, కుప్పం, గజ్వేల్, సిరిసిల్ల వంటి  వివిఐపి నియోజవర్గాలను చూస్తున్నాం. ఇపుడు తాజా ఒక చెట్టు వివిఐపి హోదా కొట్టేసింది. దానితో ఈ చెట్టును కాపాడేందుకు కట్టుదిట్టంగా కంచె, ఒక వాటర్ ట్యాంక్, చెట్టు ఆరోగ్యం కనిపెడుతూ ఉండేందుకు ఒక వృక్ష శాస్త్ర వేత్త, నలుగురు సెక్యూరిటీ గార్డులు... ఆచెట్టు ఉన్న ప్రాంతమంతా ఒక టూరిస్టు కేంద్రంగా చేసే ప్రతిపాదన. వెరసి ప్రభుత్వం మీద ఆర్థిక భారం.

ఈ చెట్టేమిటో , ఎక్కడుందో తెలుసా? ఇదొక రావిచెట్టు (పీపల్ ట్రీ). మధ్యప్రదేశ్‌లోని సల్మత్‌పూర్‌ ప్రాంతంలో భోపాల్ కు విధిషా పట్టణాలకు మధ్య  ఉంది. దాన్ని సంరక్షించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంమీద  ఏటా రూ.12 లక్షలు భారం పడుతూ ఉంది.

ఇది చాలా మందికి నచ్చడం లేదు. ఒకవైపు రైతులు పంటల్లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఒక చెట్టు సంరక్షణకు ఇంత ఖర్చేమిటని ప్రశ్నిస్తున్నారు.

 ఈ చెట్టు విశేషమేమింటే ... శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్ష ఈ  ఈ రావి మొక్కను ఇండియాకు బహూకరించారు. అయిదేండ్ల కిందట ఆయనే వచ్చి ఇక్కట నాటారు. దానిత్ ఇది దేశంలో మొట్టమొదటి వివిఐపి చెట్టయింది.

ఈ మొక్క పెరిగి పెద్దదయ్యాక మెల్లి మెల్లిగా ఆలనా పాలనా భారం కూడా పెరిగింది. చుట్టూ కంచె పెంచారు.  24 గంటలూ కాపలా ఉండేలా గార్డులను నియమించారు.  ‘నేనిక్కడికి 2012లో వచ్చాను. ఇక్కడ మరో నలుగురు గార్డులు ఉన్నారు. ఇంతకుముందు ఈ చెట్టు చూడ్డానికి చాలామంది వచ్చేవారు. కానీ ఇప్పుడు సందర్శకుల సంఖ్య తగ్గింది.’ అని పరమేశ్వర్‌ తివారీ అనే హోంగార్డు ఎన్డిటివితో అన్నారు.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios