Asianet News TeluguAsianet News Telugu

ఒక్క ‘ఐడియా’ వోడాఫోన్ నే మార్చేస్తుందా..?

ఏయిర్ టెల్, జియోలకు గట్టి పోటీనిచ్చేందుకు వోడాఫోన్ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది.

vodafone to  merge with idea soon

రిలయెన్స్ జియో దెబ్బకు టెలికాం కంపెనీలు కొత్త ఐడియాలు వెతుకుతున్నాయి.  లేటుగానైనా లేటెస్టుగా వచ్చిన జియో కి ప్రజలు వేగంగా కనెక్టు అవుతున్నారు. జియో యూజర్ల సంఖ్య రోజురోజుకు లక్షల్లో పెరుగుతోంది. 4 జీ తో పాటు ఫ్రీ కాల్స్ సౌకర్యం ఉండడంతో పోటీ టెలికాం సంస్థలు జియోకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే అనేక ఆఫర్లు ప్రకటించాయి. ఉన్న వినియోగదారులను జియో వైపు మళ్లకుండా నానాకష్టాలు పడుతున్నాయి. అయినా అవేవీ పెద్దగా ఫలితాలివ్వడం లేదు.

 

ఈ తరుణంలో జియో తో పాటు ఏయిర్ టెల్ కు చెక్ పెట్టేందుకు వోడాఫోన్ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. తాము ఐడియాలో వీలినం కావడానికి సిద్ధమని ప్రకటించింది. ఐడియా కు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ తో ఇప్పటికే దీనిపై చర్చించినట్లు  వోడాఫోన్ ఉన్నతాధికారులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఈ రెండు కంపెనీల వీలినం గురించి వార్తలు వచ్చాయి. అవి నిజమేనని ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పటికే ఐడియాతో విలీనంపై వొడాఫోన్ ఓ ప్రకటన కూడా విడుదల చేసేసింది.

 

ప్రస్తుతం ఇండియా టెలికాం రంగంలో ఏయిర్ టెల్ ప్రథమస్థానంలో ఉంది. జియో ఇప్పుడు దానికి గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు వోడాఫోన్ ఐడియాతో విలీనం అయితే ఇక నెంబర్ వన్ ప్లేస్ కోసం ఈ మూడింటి మధ్య విపరీతమైన పోటీ ఉండనుంది.

 

ఒక వేళ ఐడియా వోడాఫోన్ తో విలీనం అయితే  రెండు కంపెనీల యూజర్ల సంఖ్య ఒక్కసారిగా 39 కోట్లకు చేరుతుంది.అంటే ఆటోమేటిక్ గా వీలినం అయిన వెంటనే ఐడియావోడాఫోన్ నెంబర్ వన్ ప్లేస్ కొట్టేస్తుంది. అప్పడు ఆ స్థానాన్ని అందుకోడానికి ఏయిర్ టెల్, జియె లు మళ్లీ ఎన్ని ఎత్తులు వేస్తాయో, కొత్తగా ఎన్ని ఆఫర్లు ప్రకటిస్తాయో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios