కడుపుమండిన తెలుగు తమ్ముళ్లెవరో  వైజాగ్ లో ఎన్టీ ఆర్ విగ్రహంమీద  మూడేళ్లుగా ఉన్న ముసుగు తీసేసి, తెలుగుదేశం పెద్దాయనకు విముక్తి కల్గించారు, ఈ రోజు.

మొత్తానికి విశాఖ పట్టణం రైల్వే న్యూ కాలనీ జంక్షన్ లో వున్న ఎన్టీ రామారావు విగ్రహానికి విముక్తి లభించింది. మూడేళ్లుగా ముసుగుదెయ్యంలా వుండిపోయిన ఈ విగ్రహానికి మహానాడు సందర్భంగా ఆవిష్కరణ జరిగింది. అయితే, మహానాడులో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడో, ఆయన కుమారడులోకేశ్ నాయుడో లేదా, ఎవరయినా ప్రముఖుడు ఈ విగ్రహావిష్కరణ చేశారనుకుంటున్నారా?

తప్పు, ఈ విగ్రహానికి ఈ రోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ముసుగుతీసేసి తెలుగుదేశం పెద్దాయనకు వూరిరాడేలా చేశారు.

నగరంలోని ఒక ప్రధాన కూడలిలో మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ జరగపోవడానికి కారణం అనధికారికంగా ఏర్పాటుచేయడం అని కొందరు చెబుతారు. మరికొందరు తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విభేధాలని చెబుతారు.

ముఖ్యమంత్రి ఈ రోజు కొత్త తెలుగుదేశం పార్టీలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఆవిష్కరించారు గాని, దీని గురించి పట్టించుకోలేదు.

దీనితో కడుపుమండిన తెలుగు తమ్ముళ్లెవరో విగ్రహంమీద ముసుగు తీసేసి, ఎన్టీఆర్ కు విముక్తి కల్గించారు.