ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ వివో.. వినియోగదారులకు వాలంటైన్స్ డే కానుక ప్రకటించింది.   గతేడాది సెప్టెంబర్ లో వీ7 ప్లస్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత షాంపేన్ గోల్డ్, మ్యాట్ బ్లాక్ రంగుల్లో లాంచ్ చేసింది. తరువాత ఈ ఫోన్‌కు చెందిన ఎనర్జిటిక్ బ్లూ కలర్ వేరియెంట్‌ను విడుదల చేసింది. ఇక తాజాగా ఇదే ఫోన్‌కు చెందిన ఇన్ఫినిట్ రెడ్ కలర్ వేరియెంట్‌ను లిమిటెడ్ ఎడిషన్ రూపంలో విడుదల చేసింది. డిజైనర్ మనీష్ మల్హోత్రాతో భాగస్వామ్యం అయిన వివో ఈ ఫోన్‌ను వాలెంటైన్స్ డే కానుక‌గా  ప్ర‌త్యేకంగా విడుద‌ల చేసింది.  దీని ధర రూ.22,990గా వెల్లడించింది. ఇక ఇందులో గతంలో వచ్చిన వివో వీ7 ప్లస్ ఫీచర్లే ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు. 


వివో వీ7 ప్లస్ ఫీచర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ  డిస్‌ప్లే, 
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్,
 4 జీబీ ర్యామ్, 
64 జీబీ స్టోరేజ్, 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 
ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 
 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
 ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 
 3225 ఎంఏహెచ్ బ్యాటరీ.