అరుదైన  ఘనత సాధించిన కోహ్లీ

Virat Kohli Equals Sourav Gangulys Record Of Most centuries As India Captain
Highlights

  • గంగూలీ రికార్డును సమం చేసిన కోహ్లీ

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత సాధించాడు. టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రికార్డుని కోహ్లీ సమం చేశాడు. గతంలో భారత వన్డే క్రికెట్‌ జట్టుకు గంగూలీ కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా… కెప్టెన్ స్థానంలో ఉంటూనే గంగూలీ 11 సెంచరీలు చేశాడు. ఇన్ని సెంచరీలు.. ఏ ఇండియన్ కెప్టెన్ చేయలేదు. అయితే.. తాజాగా  దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వడ్డేలో గంగూలీ రికార్డును కోహ్లీ సమం చేశాడు. కోహ్లీ వన్డే కెరీర్‌లో మొత్తం 33 సెంచరీలు చేయగా.. కెప్టెన్ గా 11 సెంచరీలు చేశాడు.  గంగూలీ 142 ఇన్నింగ్స్‌ల్లో 11 శతకాలు సాధించగా.. కోహ్లీ కేవలం 41 ఇన్నింగ్స్‌ ల్లోనే ఆ ఘనతను అందుకోవడం విశేషం.

డర్బన్‌లో గురువారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం సెంచూరియన్‌లో జరగనుంది.

 

loader