కన్నీటి పర్యంతమయిన గన్నవరం ఎమ్మెల్యే

కన్నీటి పర్యంతమయిన గన్నవరం ఎమ్మెల్యే

అమరావతి అసెంబ్లీ లాబీ లో గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని  వంశీ మోహన్   రాజీనామా వార్త కలకలం సృష్టించింది.డెల్టా సుగర్స్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం  తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిందని ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.  డెల్టా షుగర్స్ ని తణుకు తరలించాలన్న ప్రతిపాదనను ఆయన వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల రైతులు ఇబ్బంది పడతాడరని ఆ ప్రయత్నం విరమించుకోవాలని చెప్పేందుకు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. అయితే, అక్కడ అధికారులు దురుసుగాత ప్రవర్నించడంతో ఆయన మనస్థాపం చెందారు. అందరి ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. ఒక ఎమ్మెల్యే  ఇలా చేయడం అక్కడ సంచలనం సృష్టించింది. తాను రాజీనామ ా చేసేందుకు సిద్దమయ్యానని లేఖ కూడా చూపించారు. దానిని స్పీకర్  కుసమర్పించేందుకు కూడా ప్రయత్నించారు. అయితే, వంశీ రాజీనామా లేఖ  లేఖను  బోడె ప్రసాద్ చింపేశారు. ఆయనకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈవిషయం వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టి కి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే  వంశీకి నచ్చ చప్పేందుకుమంత్రి కళా వెంకటరావు ని పంపారు. వంశీ పట్ల సిఎంఒ అధికారులు ఎందుకు దురుసుగా ప్రవర్నించారనేది ఇపుడు  సర్వత్రా చర్చనీయాంశమయింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos