కేవలం టీ, స్నాక్స్ కోసం.. రూ.68లక్షలు ఖర్చు  చేశారు.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. అది కూడా కేవలం పది నెలల్లో. త్రివేంద్ర సింగ్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అతిథులకు అందించిన టీ, స్నాక్స్ కి ఎంత ఖర్చు అయ్యిందో తెలియజేయాల్సిందిగా ఓ వ్యక్తి సమాచార హక్క చట్టాన్ని కోరారు. ఈ మేరకు ఆయన దరఖాస్తు చేసుకోగా.. సమాచార హక్కుచట్టం ఆయన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

త్రివేంద్ర సింగ్‌ గత ఏడాది మార్చి 18న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి అతిథులకు టీ, స్నాక్స్‌ కోసం రూ.68,59,865 ఖర్చైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఈ ఖర్చు చూసి అంతా షాకయ్యారు. కేవలం టీ, స్నాక్స్ కే ఇన్ని లక్షలు ఖర్చు చేస్తే.. ఇక డిన్నర్ లకి ఇంకెంత ఖర్చు అయ్యి ఉంటుందో అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపిస్తున్నారు.  ఇదిలా ఉండగా యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో మంత్రులకు టీ, స్నాక్స్‌ కోసం దాదాపు రూ.9కోట్లు ఖర్చుపెట్టింది.