Asianet News TeluguAsianet News Telugu

పొంగల్ కి చిన్నమ్మ పెద్దమ్మ అవుతుందట

తమిళనాట రాజకీయ డ్రామా మొదలయింది...పెద్దమ్మగా మారాలని చిన్నమ్మ మీద  ఒకటే...వత్తిడి 

Typical political drama unfolds at  Chennai for Sasikala

తమిళనాట వినబడుతున్న ఒకే ఒక్క మాట...

 

"తమిళనాడు ప్రజలు  పెద్ద పండగ పొంగల్ రోజు చిన్నమ్మ పెద్దమ్మ అవుతుంది."  

 

నాలుగుయిదు రోజుల్లో రంగం పూర్తిగా సిద్ధమవుతుంది. ఈ రోజే దానికి అంకురార్పణ జరిగింది.

 

జనవరి 17 న ఎమ్జీఆర్ శత జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రిగా  రెండో పెద్దమ్మ శశికళ గా ప్రారంభిస్తారని, దీనికి ఎవరూ అడ్డుకోలేరని చెబుతున్నారు.

బుధవారం నాడు చెన్నైలో ఏమి జరిగిందో చూడండి.

 

చిన్నమ్మ ఉదయం 10.45కు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అమెకు స్వాగతం పలికిన వారెవరో తెలుసా. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై. అమె పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే, చిన్నమ్మ స్వాగతం ( చిన్నమ్మ వాళగ) అని ఒకటే నినాదాల హోరు. చిన్నమ్మ కూడా జయలలిత లాగా కార్యాలయం బాల్కనీ నుంచి పార్టీ గుర్తు రెండాకులు చూపిస్తూ వాళ్లకి అభివాదం చేశారు.

 

తర్వాత ఆమె చెన్నై (నార్త్ ,సౌత్),కాంఛీపురం ( ఈస్ట, సెంట్రల్, వెస్ట్)తిరువల్లూరు (ఈస్ట్, వెస్ట్), వెల్లూర్ (ఈస్ట్, వెస్ట్) నుంచి వచ్చిన పార్టీ నేత లతో మంతనాలు ప్రారంభించారు.సాయంకాలం  తిరువణ్నామళై (నార్త్, సౌత్) కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతారు.

 

అమెను కలిసిన వారిలో పార్టీ  జిల్లాల నేతలు,  పట్టణ,  పంచాయతీ, ప్రాంతీయ కార్యదర్శులు,జనరల్ కౌన్సిల్ మెంబర్లు, ఇతర అనుబంధ సంస్థల నాయకులు ఉన్నారు.  పన్నీర్‌సెల్వం సైతం దాదాపుగా ప్రతిరోజూ శశికళ వద్ద హాజరీ వేయించుకుంటున్నారు.  ఆయన చిన్నమ్మను కలవని రోజు లేదు.

 

వచ్చే వారం రోజుల  డ్రామాలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆమెపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రతి జిల్లా పార్టీ కమిటీ కూడా తీర్మానాలు చేసి  తంబిదురై రాసిని స్క్రిప్ట్ ప్రకారం పార్టీ నాయకత్వం,  ప్రభుత్వ  నాయకత్వం ఒకరి చేతుల్లో ఉండాలని, దానికి చిన్నమ్మయో యోగ్యురాలని తీర్మానాలు చేస్తారు.

 

 ఇదంతా సోమవారం నాడు జరిగిన చిన్న డ్రామ కొనసాగింపే. సోమవారం సాయంత్రం సీఎం పన్నీర్‌సెల్వం, మంత్రులు, పార్టీ అగ్ర నేతలంతా పోయెస్‌గార్డెన్ లో శశికళతో సమావేశమైముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాలని ఒత్తిడి తెచ్చారు.  అమె ఇంకా సుముఖంగా లేరని చెబుతున్నారు.

 

ఈ వారం మొత్తం జిల్లాల వారీ సమావేశాలు జరుగుతాయి.  తరువాత రాష్ట్రస్థాయిలో భారీ సమావేశాన్ని నిర్వహించి చిన్నమ్మ శశికళను  పెద్దమ్మ గా అంటే సీఎంగా ఎన్నుకోవాలని తీర్మానంచేస్తారట.  కార్యకర్తల మనోభావాలను  గౌరవిస్తూపన్నీర్ సెల్వమ్ అమ్మచేతికి పగ్గాలిస్తారని అనుకుంటున్నారు.(ఫోటో ట్విట్టర్)

 

Follow Us:
Download App:
  • android
  • ios