Asianet News TeluguAsianet News Telugu

గడ్చిరోలి ఎన్ కౌంటర్ లో ముగ్గురు తెలుగువారి మృతి

మృతుల్లో ఇద్దరు కీలక నాయకులు

Two Maoist leaders among 16 rebels killed in encounter in Gadchiroli

మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా సరిహద్దుల్లో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్లో ఏకంగా 16 మంది మావోలు చనిపోయారు. దండకారణ్యంలో మావోల కదలికలను పక్కాగా అంచనావేసిన భద్రతా దళాలు అత్యంత పకడ్బందీగా మావొయిస్ట్ గ్రూప్ పై దాడి చేసింది. ఈ దాడినుండి వారు తేరుకుని ఎదురుకాల్పులకు దిగేలోపే భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దట్టమైన అడవిలో భద్రతాదళాలకు, మావోయిస్టులకు జరిగిన భీకర కాల్పుల్లో 16 మంది మావోలు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు తెలుగు వారితో పాటు,డివిజన్ స్థాయి నాయకులు ఉన్నారు. ఈ పోలీసుల దాడిలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల్లో సిపిఐ (మావోయిస్ట్) దక్షిణ గడ్చిరోలి డివిజినల్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, సాయినాథ్ లు ఉన్నారు. శ్రీనివాస్ వరంగల్ జిల్లా చిట్యాల మండలం హల్లగామి గ్రామానికి చెందినవాడు. ఈయనతో పాటు  శ్రీకాంత్, విజేందర్ అనే మరో ఇద్దరు తెలంగాణ కు చెందిన మావోయిస్టులు కూడా చనిపోయారు. మొత్తంగా ఈ కాల్పుల్లో ముగ్గురు తెలుగువారు చనిపోయారు. 

ఈ దాడి కాల్పులపై గడ్చరోలి ఎస్పీ స్పందించారు. రెండు నెలల నుండి అందిన పక్కా సమాచారంతో ఈ దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఈ దాడి జరిగినపుడు మొత్తం 35 నుండి 40 మంది మావోయిస్టులు ఉన్నారని, వారిలో 16 మంది చనిపోయారు. మరికొంత మందికి తీవ్ర గాయాలతో తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు.  

కీలక డివిజన్ నేతలు సాయినాథ్, శ్రీనులతో సహా మొత్తం 16 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మహరాష్ట్ర, చత్తీస్ ఘడ్ , సరిహద్దు గల ఇంద్రావతి నది తీరా ప్రాంతాల్లో గడ్చిరొలి డివిజన్ కమిటి సభ్యులు శ్రీనివాస్,సాయినాథ్ ల ఆద్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. ఇందులో  భారీ సంఖ్యలో మావోలు పాల్గొననున్నారన్న పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా దాడి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ కు చెందిన 60 బలగాలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.  తప్పించుకున్నవారి కోసం గాలింపు జరుగుతోందని, నక్సల్స్ ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీతెలిపారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios