రెండు రోజుల నుంచి పోటీపడి తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

గత రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పోటీ పడి తగ్గుతున్నాయి. ఈ రోజు పది గ్రాముల బంగారం రూ.400 తగ్గి రూ.29,150కి చేరుకుంది.

అలాగే, వెండి ధర కూడా బాగానే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.41,000 గా ఉంది. ఈ రోజు వెండి ధర కిలోకి రూ.550 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.37 శాతం తగ్గి 1,183 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.27శాతం తగ్గి 16.70 డాలర్లుగా ఉంది.