మేషం
సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృషభం
ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో రుణవిముక్తి పొందుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహనసౌఖ్యం ఉంది. కుటుంబసభ్యుల అభిప్రాయాలతో ఏకీభవిస్తారు.

మిథునం

ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అధిక శ్రమ మినహా ప్రతిఫలం ఉండదు. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు ఉంటాయి. కాంట్రాక్టర్లు నూతన టెండర్లను దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం
స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాల వల్లే ప్రయోజనం ఉంటుంది. సోదరులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. చాలాకాలంగా ఎదురుచూస్తోన్న అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

సింహం
స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిలబ్ది ఆశించినంతగా ఉంటుంది. నూతన మిత్రుల పరిచయంతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధికలావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

కన్య
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కొత్త ఒప్పందాలను కుదురుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.

తుల
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్ధికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందువినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక వస్తులాభం ఉంది. జీవిత భాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది.

వృశ్చికం
వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను కొంతవరకు అధిగమిస్తారు. ఊహించని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు, ఆర్ధిక ఇబ్బందులు కొంతవరకు తీరుతాయి. సోదరుల నుంచి ధనలాభం ఉంది. కీలక వ్యవహారాల్లో తొందరపాటు తగదు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు
ప్రముఖులను కలుసుకుంటారు. మిత్రులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులకు లాభదాయకంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తు కోసం కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు.

మకరం
రుణ విముక్తి పొందుతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ అభిప్రాయాలకు తగిన గౌరవం లభిస్తుంది.

కుంభం
చేపట్టిన పనులలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు లాభిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు.

మీనం
చేపట్టిన కార్యక్రమాలలో ఎదురైన జాప్యాన్ని అధిగమిస్తారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన విబేధాలు పరిష్కారం కావడంతో ఊరట చెందుతారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. వస్తులాభం ఉంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది.