Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్రవరి 26 2018 సోమవారం మీ రాశి ఫలాలు

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today feb26th your horoscope

మేషం

మేషం : ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వల్ల ఇబ్బందిపడే అవకాశముంటుంది.

వృషభం

వృషభం : ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మిథునం

మిథునం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీ పైఅధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు ఇబ్బంది కలిగించవచ్చు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, చెవులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందం గా గడుపుతారు. మీ జీవితభాగస్వామి కోసం లేదా కుటుంబ సభ్యులకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యూనికేషన్‌కు అనుకూల దినం.

కన్య

కన్య : ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.

తుల

తుల : ఈ రోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయం లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పుకానీ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవడం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సం బంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతారు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయడానికి బద్దకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయి దా వేసే అవకాశముంటుంది. ఆహారవిషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కుంభం

కుంభం : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనం

మీనం : ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయడం చేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి.

Follow Us:
Download App:
  • android
  • ios