Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్రవరి 24, 2018 శనివారం మీ రాశి ఫలాలు

  • .ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today feb24th your horoscope

మేషం

మేషం : ఈ రోజు కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. కుటుంబ సభ్యుల కోపానికి గరవుతారు. మీ మిత్రులతో, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగటం లేదా మిమ్మల్ని అపార్థం చేకోవచ్చు. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం

వృషభం :ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఏర్పడతాయి.

మిథునం

మిథునం :ఈ రోజు వాయిదా పడిన పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూల దినం. అనుకోని బహుమతి కానీ ప్రశంస కానీ పొందుతారు. మీ మిత్రులు, బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా ఇబ్బందులకు లోనవుతారు. ఇంట్లోకి కొత్తవస్తువులు కొనవచ్చు, ఇల్లు సర్దవచ్చు.ఆర్థికంగా సామాన్యంగా ఉంది.

సింహం

సింహం :ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు కలత చెందుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలెన భయం ఎదురవుతాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

కన్య

కన్య :ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలు, అంగీకారాలు పుచ్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. మీ ప్రేమ, ఆప్యాయత వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్య విషయంలో లేదా విద్య పరంగా కొంత ఆందోళన చెందుతారు.

తుల

తుల :ఈ రోజు వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

వృశ్చికం

వృశ్చికం : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే మీ ప్రేమ మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మీలో ఉంటుంది. మీ భావోద్వేగాల అదుపులో ఉంచుకోవటం మంచిది. కాంపిటేటివ్ పరిక్ష రాస్తున్నవారు విజయం సాధిస్తారు.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు మీ ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగా కొంత ఆందోళన , చిరాకుగా ఉంటుంది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణంలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంది.

మకరం

మకరం : ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అత్యుత్సాహానికి పోకుండా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది.

కుంభం

కుంభం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీ వసూలైనప్పటికీ, అందుకు తగిన ఖర్చులు ఉండటంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కారణంగా కూడా డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.

మీనం

మీనం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచికరమైన ఆహారం లభిస్తుంది. మీ బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలం. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios